E-Paper
Advertisement

Charmy kaur : స్లమ్ డాగ్ సక్సెస్ కోసం అక్కడ పూజలు చేయించిన ఛార్మి.. సక్సెస్ వచ్చేనా?

Charmy kaur : స్లమ్ డాగ్ సక్సెస్ కోసం అక్కడ పూజలు చేయించిన ఛార్మి.. సక్సెస్ వచ్చేనా?
Advertisement

Charmy Kaur : ఛార్మి కౌర్ పరిచయం అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్  పలు సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఇటీవల సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇలా వెండితెరపై హీరోయిన్ గా సినిమాలకు దూరమైనప్పటికీ తెర వెనక మాత్రం నిర్మాతగా మారి సినిమాలను ముందుకు నడిపిస్తున్నారు. ఈమె దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తో కలిసి పూరి కనెక్ట్స్ అని బ్యానర్ ద్వారా పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.. ఇక త్వరలోనే వీరి బ్యానర్లో హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన స్లమ్ డాగ్ (Slum Dog)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

పెద్దమ్మతల్లి ఆలయంలో పూరీ, ఛార్మి..

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో పూరీ జగన్నాథ్ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా పూరి జగన్నాథ్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో సందడి చేశారు. నటి చార్మితో కలిసి ఈయన పెద్దమ్మతల్లి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఇలా అమ్మవారి దర్శనం అనంతరం ఛార్మి పూరీ జగన్నాథ్ ఇద్దరు ఆలయం బయట సందడి చేస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ తమ సినిమా మంచి సక్సెస్ అవ్వటం కోసం ప్రత్యేకంగా పూజలు చేయించారని తెలుస్తుంది.

విజయ్ సేతుపతితో పూరి సినిమా..

Advertisement

ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ చార్మి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు అయినప్పటికీ సరైన స్థాయిలో సక్సెస్ అందుకోని నేపథ్యంలో పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలా వరుస సినిమాలు నిరాశ పరుస్తున్న వీరిద్దరూ మాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలను చేస్తున్నారు. ఇటీవల డబల్ ఇస్మార్ట్ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం తెలుగులో విజయ్ సేతుపతితో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి పూరి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆకట్టుకున్న స్లమ్ డాగ్ ఫస్ట్ లుక్..

Advertisement

విజయ్ సేతుపతి సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా స్లమ్ డాగ్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ గురించి చిత్ర బృందం అధికారకంగా ప్రకటన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి టబు, విజయ్ కుమార్ బ్రహ్మాజీ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Summer Holidays: ‘సమ్మర్ హాలిడేస్’ అంటూ రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్!

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×