E-Paper
Advertisement

“మాధురి రాథోడ్ నోరు విప్పితే అంతా జైలుకే”.. నిజాలు బయటపెట్టిన ఫోక్ ప్రొడ్యూసర్!

“మాధురి రాథోడ్ నోరు విప్పితే అంతా జైలుకే”.. నిజాలు బయటపెట్టిన ఫోక్ ప్రొడ్యూసర్!
Advertisement

Madhuri Rathod:మాధురి రాథోడ్ (Madhuri Rathod) .. రీసెంట్ టైమ్స్ లో “బాసింగ బలాలే”:అనే ఆల్బమ్ వీడియోతో యూట్యూబ్లో సెన్సేషన్ గా మారిన ఈమె అనూహ్యంగా వివాదంలో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అద్భుతమైన టాలెంట్, అంతకుమించి గొప్ప డాన్సర్ గా పేరు సొంతం చేసుకున్న మాధురి రాథోడ్.. తన తోటి డాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai) తో గదిలో ఉండడం, వీరిద్దరిని ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం అంత జరిగిపోయింది. ఆ తర్వాత ఈశ్వర్ సాయి స్పందిస్తూ.. అందులో తన తప్పేమీ లేదని, ఒత్తిడి వల్లే అలా జరిగిపోయిందని ఒక వీడియోలో చెప్పి.. మరొక వీడియోలో తాను ఆమె గదిలోని వాష్ రూమ్ వాడుకోవడానికి మాత్రమే వెళ్లానని.. అంతలోనే తన భార్య వచ్చి నానా రభస చేసింది అంటూ మాధురి రాథోడ్ ను క్షమించమని కోరుతూ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

మాధురి నోరు విప్పితే అంతా జైలుకే – ఫోక్ ప్రొడ్యూసర్

అయితే ఇలాంటి సమయంలో మాధురి రాథోడ్ గురించి ప్రముఖ ఫోక్ ప్రొడ్యూసర్ చైర్మన్ మున్నా (Munna) మాట్లాడుతూ ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా “మాధురి రాథోడ్ నోరు విప్పితే అందరూ జైలుకు వెళ్తారు ” అంటూ ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఫోక్ ప్రొడ్యూసర్ చైర్మన్ మున్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాధురి రాథోడ్ గురించి చెప్పుకొచ్చారు. ఫోక్ చైర్మన్ మున్నా మాట్లాడుతూ మాధురి రాథోడ్ రివర్స్ అయితే అందరూ జైలుకు వెళ్తారు.

ఆమె స్టార్ డంను ఓర్వలేకపోయారు – మున్నా

Advertisement

ఇంటర్వ్యూలో భాగంగా ఇంటర్వ్యూయర్.. మీ ఫోక్ గ్రూపులో ఇంత కక్ష గట్టి ఒక అమ్మాయి పై ఇలాంటి నిందలు వేస్తారా? ఇంత స్వార్థంగా ఒక అమ్మాయి పై నిందలు వేసి, బజారుకు ఈడ్చడం ఎంతవరకు కరెక్ట్ పాపం ? అంటూ ఆమె ప్రశ్నించగా మున్నా మాట్లాడుతూ.. “ఈర్ష ఎక్కువైంది. ఒకరి గ్రోత్ ను చూసి మరొకరు ఈర్ష పడుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా స్వార్థం ఉంటుంది. మాకంటే ఆలస్యంగా వచ్చింది. మంచి మంచి పాటలు పడుతున్నాయి. మంచి డాన్సర్ .. చాలా టాలెంట్ ఉంది. పైగా అందంగా ఉంటుంది. తక్కువ సమయంలోనే స్టార్డం వచ్చేసింది. ఇక ఇవన్నీ చూస్తే ఎవరికైనా అసూయ కలుగుతుంది. ఇక ఆ ఈర్ష తోనే అందరూ కట్టగట్టుకొని మరీ.. కావాలనే బుక్ చేశారు”. అంటూ మాధురి రాథోడ్ వెనుక జరిగిన కుట్ర గురించి ప్రొడ్యూసర్ సంచలన నిజాలు బయటపెట్టారు .

also read:సనాతన ధర్మం.. ట్రోలర్స్ కి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్ !

మాధురి రాథోడ్ వెనుక ఇంత కుట్ర జరిగిందా?

Advertisement

ఆయన మాటలను బట్టి చూస్తే తక్కువ సమయంలో స్టార్డం రావడం చూసి ఓర్వలేక కావాలని ఆమె వెనుక ఇంత కుట్ర పన్ని.. ఇలా ఆమెపై నిందలు వేశారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు . ఏదేమైనా ఒక్క ఫోక్ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే పక్కవాళ్ళు ఎదుగుతున్నారంటే ఓర్వలేక ఇలా ఎంతోమంది వారిపై నిందలు వేస్తూ.. వారి కెరియర్ను డౌన్ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే తక్కువ సమయంలోనే స్టార్డం తెచ్చుకున్న మాధురికి ఆ స్టార్డమ్ ఇప్పుడు ఆమెకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×