E-Paper
Advertisement

Madhavi Latha: మగాళ్లపై మరోసారి రెచ్చిపోయిన మాధవీలత.. రె*ట్ట వేయడానికి కూడా పనికిరారంటూ!

Madhavi Latha: మగాళ్లపై మరోసారి రెచ్చిపోయిన మాధవీలత.. రె*ట్ట వేయడానికి కూడా పనికిరారంటూ!
Advertisement

Madhavi Latha:తనీష్ హీరోగా వచ్చిన తెలుగు రొమాంటిక్ చిత్రం ‘నచ్చావులే’ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది మాధవీ లత (Madhavi Latha). మొదటి సినిమాతోనే కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఆ తర్వాత స్నేహితుడు, అరవింద్ 2, అంబాల వంటి చిత్రాలలో నటించిన ఈమె తన అద్భుతమైన నటనతో మూడు నంది అవార్డులను కూడా అందుకుంది. ఇకపోతే గత కొంతకాలంగా మగాళ్లపై ఊహించని కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో తనదైన కామెంట్లు పెడుతూ నిత్యం వార్తల్లో నిలిచే ఈమె.. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పూర్తయిన సందర్భంగా మగాళ్ళపై మరోసారి రెచ్చిపోతూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కోటి మందిలో ఒక మగాడు మాత్రమే మంచివాడు అని మగాళ్ళందరూ రె*ట్ట వేయడానికి కూడా పనికిరారు అంటూ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.

ఉమెన్స్ డే స్పెషల్ విషెస్ పై మాధవి లత మండిపాటు..

మాధవీ లత తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అందులో ఇలా చెప్పుకొచ్చింది. “అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మగాడు మహిళలకు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పారు. మరి అన్నీ అయిపోయాయా.. ఇక మళ్లీ ఎప్పటిలాగే రొటీన్ రోజులు మొదలవుతాయి. ఇక మీకు నచ్చినట్లు ఆడవాళ్లను తొక్కేయొచ్చు.. హింసించొచ్చు.. నన్ను ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అన్నారు. కొంతమంది కామెంట్స్ పెడతారు.. నీకు మగాళ్లు అంటే పరమ చిరాకు అని.. అయితే మళ్లీ వాడే కామెంట్ పెడతాడు.. ఎవరో ఒకరు నిన్ను పోషించడానికి ఉంటారులే.. మెన్ హేటర్ అని ఒకసారి మీరే కామెంట్ చేసినప్పుడు.. మళ్లీ నన్ను పోషించడానికి ఇంకొక మగాడు ఎందుకుంటాడు? ఇలాంటివి మీరు ఆలోచించరా.. అంటే ఎంతసేపు ఆడది మగాళ్ళ కాళ్ళ కిందే బతకాలి.

మగాళ్లు గురువిందగింజతో సమానం అంటూ..

Advertisement

ఆడదానికి బ్రెయిన్ ఉండదు.. పనిచేయడానికి పనికిరాదు.. మగవాడు పని చేస్తే డబ్బులు ఇస్తారు.. ఆడవాళ్లు పనిచేస్తే రాళ్లు ఇస్తారు. ఇది సమాజం తీరు. కానీ ఎందుకు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పడం.. బాగా చదువుకోవాలి కానీ మీ కాళ్ళ కింద నలిగిపోవాలి.. మంచి ఉద్యోగం చేయాలి కానీ మీరు చెప్పినట్టు వినాలి.. ఎంత పొజిషన్ కి వెళ్లినా అణిగిమనిగి ఉండాలి.. ఆమెకు ఆత్మాభిమానం ఉండకూడదు.. దాన్ని అహంకారం అంటారు..మగవాడికి ఉంటే ఆటిట్యూడ్.. ఆడదానికి ఉంటే తల పొగరు, తల దురుసు.. ఇది ఎప్పటికీ మగ సమాజమే.. ఆడదానికి స్వేచ్ఛ లేదా అంటే ఉంటుంది.. కానీ ఎండ్ ఆఫ్ ది డే వరకు మాత్రమే.. మళ్లీ బట్టల విషయంలో ఏదో ఒక గోల చేస్తారు. మళ్లీ ఇంటికి వచ్చాక తనతో ఎవరు రిలేషన్ లో ఉంటే వాళ్లు కొట్టొచ్చు విడిపోవచ్చు మళ్లీ ఆ ట్రోమాలో నుంచి బయటపడలేక ఆ అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. ప్రపంచమంతా ఇదే జరుగుతోంది.

also read:Rashmika Mandanna: భావోద్వేగానికి గురైన రష్మిక.. జీవితంలో ఇదే తొలిసారి అంటూ!

కాకి రెట్ట వెయ్యడానికి కూడా పనికిరారు..

Advertisement

ఎక్కడో నోటికో కోటికో కాదమ్మా.. కోటికే ఒక్కడుంటాడు.. ముఖ్యంగా ఏ ఒక్క మగాడికి ఆడదాని గురించి మాట్లాడే హక్కులు కానీ అర్హతలు కానీ లేవు. ప్రతి ఒక్క మగాడు గురివిందగింజే. మీ మొహం మీరు ముఖంలో చూసుకుంటే.. కాకి కూడా మీ మీద రెట్ట వేయడానికి మీరు పనికిరారు” అంటూ చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.. ప్రస్తుతం మాధవి లత పంచుకున్న ఈ వీడియో.. చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే దీనిపై కొంతమంది నెటిజన్స్ ఎప్పటిలాగే ఈమెకు మద్దతు పలుకుతుంటే.. మరికొంతమంది అసలు నీ బాధ ఏంటో చెప్పు అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

Big Stories

Advertisement
×