Rashmika Mandanna:తెరపై ఒక నటుడు లేదా నటి తన అచంచలమైన ప్రతిభతో ఊహించని విజయాలను సొంతం చేసుకుంటే.. ఆ విజయాల వెనుక వారు పడ్డ కష్టం వర్ణనాతీతం. అయితే విజయాన్ని సాధించాలనే దిశగా అడుగులు వేసే క్రమంలో కష్టాలు ఎన్ని ఎదురైనా.. అలవోకగా ఎదుర్కొంటూ దూసుకు వెళ్తున్నారు. అయితే ఆ కష్టాలను ఎవరైనా గుర్తించి వారిని ప్రశంసిస్తే మాత్రం.. ఆ క్షణం ఆ సెలబ్రిటీలు భావోద్వేగానికి గురవుతారు అనడంలో సందేహం లేదు. సరిగ్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) జీవితంలో కూడా ఇదే జరిగింది.. అందుకే భావోద్వేగానికి గురైన ఆమె తన జీవితంలో తన కష్టాన్ని గుర్తించి.. తన ప్రయాణాన్ని మళ్లీ గుర్తు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు సినిమాల కంటే వచ్చిన సక్సెస్ కంటే తన కష్టానికి తగిన గుర్తిపే తనను మరింత ఆనందింప చేసేలా చేస్తోంది అంటోంది ఈ ముద్దుగుమ్మ . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ది గర్ల్ ఫ్రెండ్ కి గద్దర్ అవార్డ్..
గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో మొదలైన పరిచయం.. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో మరింతగా బలపడింది. ఈ రెండు చిత్రాల తర్వాత ఇద్దరు ఒకరి మనసులు ఒకరు విప్పుకొని ఒకరంటే ఒకరికి ఇష్టంగా మారిపోయారు. చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంటా పడకుండా ఎప్పటికప్పుడు తమ బంధాన్ని రహస్యంగా మెయింటైన్ చేస్తూ వచ్చిన ఈ జంట.. ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ప్రస్తుతం వైవాహిక బంధాన్ని ఆస్వాదిస్తున్న ఈమెకి ఇటీవల తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులలో భాగంగా ఉత్తమ నటి విభాగంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కి వరించింది. ఇక ఈ సంతోషంలో మునిగితేలుతున్న రష్మిక మందన్న.. తాజాగా ఒక నెటిజన్ చేసిన పోస్టుకు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యింది.
ALSO READ:Hamsa Nandini: క్యాన్సర్‌తో పోరాటం.. ఏకంగా 16 కిమో థెరపీలు.. ఆ రోజులను తలచుకుంటూ నటి ఎమోషనల్
సదరు నెటిజన్ తన కథనంలో విజయ్ – రష్మిక ప్రేమ, పెళ్లి, వాళ్ళిద్దరి ప్రయాణం గురించి రాసుకొచ్చారు. ఇది చూసిన రష్మిక ఆ కథనంపై రిప్లై ఇస్తూ చాలా రోజులుగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ లేనంతగా భావోద్వేగానికి గురయ్యాను.ముఖ్యంగా ఇలా భావోద్వేగానికి గురవడం నా జీవితంలో బహుశా ఇదే తొలిసారి ఏమో అంటూ స్పందించింది. రష్మిక తన ట్వీట్ లో.. “నా గురించి రాసిన కథనం చదివిన తర్వాత నేనెప్పుడూ కూడా ఇంతలా భావోద్వేగానికి గురవ్వలేదు. నేను చెప్పాలనుకుంది చాలా ఉంది . కానీ మాటలు రావడం లేదు. ఇప్పుడు నేను ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ప్రయాణంలో చాలా సంతోషంగా ఉన్నాను . నా ప్రయాణం గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని స్వేచ్ఛగా ఉంచే ప్రేమను మీరు వెతకండి” అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ఇక ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా సదరు నెటిజన్ పెట్టిన కథనం కూడా అంతే వైరల్ గా మారింది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ తో రష్మిక ప్రయాణం కలకాలం సంతోషంగా సాగాలని ఆశిద్దాం..
I have never become so emotional reading something written about me this much in a long long time..
There is so much I want to say but so little I can say.I am finding my own room and that’s a journey I am so grateful for..
Thankyou for recognising it..❤️About love all I… https://t.co/f7W5vv0UJ5
— Rashmika Mandanna (@iamRashmika) March 8, 2026