E-Paper
Advertisement

Yamaha XSR 155 vs Honda Unicorn: యమహా XSR 155 vs హోండా యూనికార్న్, వీటిలో ఏది బెస్ట్ బైక్?

Yamaha XSR 155 vs Honda Unicorn: యమహా XSR 155 vs హోండా యూనికార్న్, వీటిలో ఏది బెస్ట్ బైక్?
Advertisement

Yamaha XSR 155 vs Honda Unicorn Comparison: ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు సరికొత్త సరికొత్త బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. యమహాతో పాటు హోండా నుంచి క్రేజీ బైక్స్ విడుదల అయ్యాయి. వాటిలో రెట్రో స్పోర్ట్ మోడల్ లో వచ్చిన యమహా XSR 155, డెయిలీ కమ్యూటర్ హోండా యూనికార్న్ మంచి ప్రజాదరణ పొందాయి. రెండు వేర్వేరు విభాగాలకు చెందిన ఈ బైక్స్ అమ్మకాల్లోనూ సత్తా చాటుతున్నాయి. XSR 155 ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, ఎక్కువ పవర్ అందిస్తే, హోండా యూనికార్న్ మంచి మన్నిక, మెరుగైన మైలేజ్ అందిస్తుంది. తక్కువ ధరతో వస్తుంది. పనితీరు, స్టైల్ కోసం XSR, రోజువారీ ప్రయాణం కోసం యూనికార్న్ బైక్స్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ రెండు బైక్స్ మధ్య పోలికలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

యమహా XSR 155 vs హోండా యూనికార్న్ మధ్య తేడాలు

⦿ ధర: హోండా యూనికార్న్ బడ్జెట్ ఫ్రెండ్లీ కమ్యూటర్. దీని ధర సుమారు రూ.1.13 లక్షలు ఉంటుంది. అయితే, యమహా XSR 155 ప్రీమియం రెట్రో స్టైల్ బైక్. దీని ధర సుమారు రూ.1.50 లక్షలు ఉంటుంది. XSR 155 ప్రస్తుతం ఇండియాలో  అధికారికంగా అందుబాటులో లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో అందుబాటులో ఉంది.

Advertisement

⦿ ఇంజిన్  పవర్: యమహా XSR 155 బైక్ 155cc, లిక్విడ్ కూల్డ్, FI ఇంజిన్ తో స్పోర్టీ లుక్, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. యూనికార్న్ 162.71cc, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది. స్మూత్, నమ్మమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

⦿ డిజైన్: XSR 155 రెట్రో మోడ్రన్ లుక్‌ తో ఎల్‌ఈడీ లైట్లు, డిజిటల్ కన్సోల్‌ ను కలిగి ఉంటుంది. యూనికార్న్ సాంప్రదాయ, సింపుల్ డిజైన్‌తో వస్తుంది.

Advertisement

⦿ మైలేజ్: యూనికార్న్ లీటర్ కు దాదాపు 50 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. XSR 155 కూడా సుమారు 45-50 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనా.

⦿ హ్యాండ్లింగ్: XSR 155 దాని తేలికపాటి బరువు 137 కిలోలు ఉంటుంది. డెల్టా బాక్స్ ఫ్రేమ్‌ తో చురుకైన హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది. యూనికార్న్ కూడా ఇంచుమించు ఇదే బరువును కలిగి ఉంటుంది.

ఏ బైక్ కొనుగోలు చేయడం మంచిది?  

ఒకవేళ మీరు సూపర్ స్టైల్, అదిరిపోయే ఫీచర్లు, స్పోర్టీ రైడింగ్ కోసం చూస్తున్నట్లు అయితే, యమహా XSR 155ని కొనుగోలు చేయడం మంచిది. తక్కువ ధర, నమ్మదగిన ఇంజిన్, రోజువారీ ప్రయాణం కోసం అయితే, హోండా యూనికార్న్ ను కొనుగోలు చేయడం మంచిది.

Read Also:  కొత్త లెక్సస్ ES లాంచ్ డేట్ ఫిక్స్, వావ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×