E-Paper
Advertisement

Ys jagan : ఆ వర్గాలపై జగన్ ఫోకస్..ఆ మచ్చ పోగొట్టుకునేందుకేనా?

Ys jagan : ఆ వర్గాలపై జగన్ ఫోకస్..ఆ మచ్చ పోగొట్టుకునేందుకేనా?
Advertisement

ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.గతంలో చేసిన తప్పులకు తావివ్వకుండా ఈసారి అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొంతమంది నాయకులు మాత్రమే పార్టీలో చక్రం తిప్పేవారు. జగన్‌కు సన్నిహితంగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో జరిగే పరిణామాలు, నేతల విజ్ఞప్తులు వీరే అధినేతకు చేరవేసేవారు. అక్కడ నుంచి ఏ నిర్ణయం రాకుంటే వీరే తమకు తోచింది చెప్పేసి పంపించేవారని టాక్.ఫలితంగా జగన్‌కు ముఖ్యనేతలు దూరం అయ్యారు. అది కూడా ఎన్నికల్లో పార్టీ పరాభవానికి ఓ కారణం అని జగన్ ఎట్టకేలకు గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది.

రెడ్లకే ప్రయారిటీ..

వైఎస్ జగన్ మోహన్ .. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత.. గతంలో ఆయన చుట్టూ ఉండే కోఠరీ సైతం రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి, విజయాసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇలా వీరంతా ఆయన చుట్టూ ఉండటంతో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలే వైసీపీలో పదవులు పొందారని, లాభపడ్డారని అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల్లో ఓటమి అనంతరం జగన్‌కు అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి దూరం అయ్యారు. పార్టీకి, జగన్‌కు విజయసాయి దూరం కావడానికి సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని ఊహాగాహనాలు వినిపించాయి. జగన్ తాము చెబితే వినే పరిస్థితుల్లో లేరని ఒకానొక సందర్భంలో విజయసాయి వ్యాఖ్యానించడంతో ఈ అనుమానం మరింత బలపడింది.

మారిన జగన్ ఆలోచన ధోరణి..

Advertisement

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓటమికి గల కారణాలను సమీక్షించిన జగన్.. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి? కీలక నేతలు ఎలా దూరం అయ్యారు? ఓటింగ్ ఎలా చీలిపోయింది? అందుకు ఏ సామాజిక వర్గం ఓటర్లు కారణం? అక్కడ ఇప్పటివరకూ ఇన్‌చార్జులుగా ఎవరున్నారు? ఇలా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా జగన్ పరిశీలించినట్టు సమాచారం. దీంతో పార్టీలో సంస్థాగత మార్పులకు ఆయన శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయా నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గానికి ఎంత బలం ఉందో గుర్తించి అక్కడ ఆ సామాజిక వర్గం నేతకే ఇన్ చార్జి, కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తున్నది.

YS Sharmila: కల్తీ పాల ఘటన.. ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే.. వైఎస్ షర్మిల ఫైర్

Advertisement

రాయలసీమలో ముఖ్యంగా రెడ్ల సామాజిక వర్గం నేతలు అధికారం. ఉత్తర ఆంధ్రలోని గోదావరి జిల్లాల్లో కాపు, కమ్మ, ఎస్సీఎస్టీలు అధికంగా ఉంటారు.అందుకే అక్కడ కాపు, కమ్మ, వెనుకబడిన వర్గాల నేతలకు బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తున్నది. వైసీపీని అక్కడి ప్రజలు తమ సొంత పార్టీగా అనుకోవడానికి ఈ రాజకీయ, సామాజిక సమీకరణాలు సాయం చేస్తాయని జగన్ అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు బొత్ససత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ వంటి బీసీ, వెనుకబడిన వర్గాల నేతలకు జగన్ పెద్దపీట వేసినట్టు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే లక్ష్యంగా మాజీ సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

Related News

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

Big Stories

Advertisement
×