E-Paper
Advertisement

Actor Vishal: ఆ విషయంలో విశాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు .. పిటిషన్ కొట్టివేత!

Actor Vishal: ఆ విషయంలో విశాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు .. పిటిషన్ కొట్టివేత!
Advertisement

Actor Vishal: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశాల్ (Vishal)కు మద్రాస్ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆయన లైకా ప్రొడక్షన్(Lyca Productions) కు సంబంధించిన విషయంలో కోర్టును ఆశ్రయించి తనకు 10 కోట్ల రూపాయలు చెల్లించడానికి కొంత సమయం కావాలి అంటూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు డబ్బులు చెల్లించడానికి విశాల్ కు సమయం ఇవ్వటానికి సానుకూలంగా స్పందించకుండా ఈ పిటీషన్ కొట్టి వేస్తూ హీరో విశాల్ కు షాక్ ఇచ్చింది.

లైకా ప్రొడక్షన్ నుంచి అప్పు తీసుకున్న విశాల్..

లైకా ప్రొడక్షన్ కి సంబంధించిన ఈ కేసులో భాగంగా డబ్బులు చెల్లించడం కోసం విశాల్ మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ద్వి సభ్య ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై మద్యంతర స్టే విధించింది. అదేవిధంగా విశాల్ ఇవ్వాల్సిన 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి అంటూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ డబ్బులను చెల్లించడానికి విశాల్ ఆరు వారాలపాటు గడువు కావాలంటు పిటిషన్ దాఖలు చేయటంతో కోర్ట్ ఊహించని తీర్పు వెల్లడించింది. ఇక ఈ కేసు విషయానికి వస్తే హీరో విశాల్ లైకా నిర్మాణ సంస్థ నుంచి 2019లో 21.29 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్న విశాల్ తిరిగి ఈ అప్పు చెల్లించకపోవడంతో ఈ విషయంపై వివాదం చెలరేగడమే కాకుండా లైకా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.

గడువు కోరిన విశాల్..

Advertisement

ఈ విషయం కాస్త కోర్టుకు చేరడంతో 30% వడ్డీతో సహా అప్పు చెల్లించాలి అంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసిన విశాల్‌కు, డివిజన్ బెంచ్ రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతుతో స్టే ఇచ్చింది. అయితే ఈ 10 కోట్ల రూపాయల చెల్లించడానికి సమయం కావాలి అంటూ ఈయన పిటిషన్ దాఖలు చేయడంతో నేడు ఈ పిటీషన్ ని తిరస్కరించింది. వెంటనే విశాల్ 10 కోట్లు డిపాజిట్ చేయాలి అంటూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. విశాల్ నిర్మాతగా వీరమై వాడై చూడుమ్ సినిమా కోసం అప్పు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తెలుగులో సామాన్యుడు అనే పేరిట విడుదల అయింది.

రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..

Advertisement

ఈ సినిమా విడుదలైనప్పటికీ విశాల్ డబ్బు చెల్లించకపోవడంతో లైకా నిర్మాతలు హీరో విశాల్ కు ఒక కండిషన్ పెట్టారు. అప్పు కట్టే వరకు ఈ సినిమా పూర్తి హక్కులు తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే విశాల్ మాత్రం ఈ సినిమా హక్కులను ఇతర సంస్థకు అమ్మేయడంతోనే వీరి మధ్య వివాదం చెలరేగి కోర్టు వరకు ఈ పంచాయతీ వెళ్ళింది. అప్పటినుంచి ఈ వివాదం ఇప్పటికీ కోర్టులో కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పటికైనా విశాల్ కోర్టు ఆదేశాలను అనుసరిస్తూ పది కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది . ఇక విశాల్ హీరోగా తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు.

Also Read; Vishwak Sen: నా అకౌంట్లో రూ. లక్ష చూడటమే కల.. ఆ క్షణం కన్నీళ్లాగలేదు..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×