E-Paper
Advertisement

Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం చైర్మన్​ ఎన్నిక మళ్లీ వాయిదా? కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సభ్యుల మధ్య ఘర్షణ!

Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం చైర్మన్​ ఎన్నిక మళ్లీ వాయిదా? కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సభ్యుల మధ్య ఘర్షణ!
Advertisement

Ibrahimpatnam Municipality:  రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ఈనెల 11వ తేదీన జరిగిన మున్సిపాలిటీ పోలింగ్​, 13వ తేదీన ఫలితాలు వెల్లడించారు. ఫలితాల ఆధారంగా ఈనెల 16వ తేదీన చైర్మన్​, వైఎస్​ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏదైన కారణంతో వాయిదా పడిన ఎన్నికను తిరిగి  నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కానీ మంగళవారం జరిగాల్సిన చైర్మన్​, వైస్​ చైర్మన్​ ఎన్నిక సైతం గందరగోళం మధ్యలోనే కొనసాగింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6గంటల వరకు ఏలాంటి నిర్ణయం రిటర్నింగ్ అధికారి తీసుకోలేకపోవడం గమనార్హం. తదుపరి ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో కూడా అధికారులు వెల్లడించలేదు. హైకోర్టు స్టే విధించడంతోనే ఎన్నిక ప్రక్రీయను నిలిపివేసినట్లు రిటర్నింగ్​ అధికారి అనంత్​ రెడ్డి తెలిపారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణలు

రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగగా 5 మున్సిపాలిటీలకు చైర్మన్​, వైఎస్​ చైర్మన్​ ప్రక్రియ కూడా పూర్తైయింది. కానీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్​, వైస్​ చైర్మన్​ ఎన్నికల ప్రక్రియ ముందుకు కొనసాగడం లేదు. మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన మున్సిపాలిటి సమావేశంలో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అగ్రహానికి లోనైన కొందరు సభ్యులు ఇరువర్గాలు టెబుళ్లను, కూర్చీలను విసేరేసుకోని ఆందోళన చేశారు. చైర్మన్​, వైస్​ చైర్మన్​ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. చైర్మన్​గా బీఆర్ఎస్​ అభ్యర్ధి టేకుల సుదర్శన్​ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది.

యాదగిరి కిడ్నాప్‌పై నమోదు 

Advertisement

వెంటనే అడ్వకట్ జనరల్ ఎన్నిక ప్రక్రీయను సాయంత్రం వరకు వేచిచూడాలని అధికారికి ఆదేశాలు అందాయి. దాంతో సాయంత్రం వరకు రిటర్నంగ్​ అధికారి నిలిపివేశారు. చైర్మన్​ పీఠం ఏలాగైన కైవసం చేసుకోవాలనే పట్టుదలతో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రక్రియలో అధికారులు జాప్యం చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది.  జరిగిన సమావేశానికి బీఆర్ఎస్​ అభ్యర్ధిగా గెలుపోందిన ఆకుల యాదగిరి హాజరుకాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదగిరి కిడ్నాప్‌పై నమోదైన హెబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా ఎన్నిక ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 19వ తేదీన ఆకుల యాదగిరిని హైకోర్టులో హజరుపర్చాలని పోలీసులు ఎన్నికల రిటర్నింగ్​ అధికారి వివరించడం జరిగింది.

Also ReadGadwal Municipality: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యం : డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి!

పోలీసుల అదుపులో యాదగిరి

Advertisement

హైకోర్టులో హాజరుపర్చాలనే పోలీసులు కౌన్సిలర్​ ఆకుల యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యాదగిరిని కాంగ్రెస్​ క్యాంపులో కలుపుకునేందుకు పోలీసుల సహకారంతో అడుగులు వేస్తున్నారని బీఆర్ఎస్​ నేతలు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఏ పార్టీ క్యాంపులోకి వెళ్లకుండా తమ అధీనంలోనే ఉంటారని పోలీసులు వివరించారు. కానీ స్ధానిక పోలీస్ స్టేషన్​లో ఉన్న కాంగ్రెస్ నాయకుల మధ్య ఆకుల యాదగిరిని కూర్చోబెట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారని సోషల్​ మీడియాలో వీడియోలు హాల్చల్ చేస్తున్నారు.

చైర్మన్​ ఎన్నిక తర్వాత బ్రేక్​

మున్సిపాలిటీ పరిధిలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా మ్యాజిక్ ఫీగర్ 13 మంది ఉండాలి. బీఆర్ఎస్​కు మద్దతుగా 15 మంది కౌన్సిలర్లు గులాబీ కండువాలు కప్పుకొని సమావేశానికి హాజరైనారు. కాంగ్రెస్​ పార్టీ తరపున ఎక్స్​ ఆపీసియోతో కలిపి 9 మంది ఉన్నప్పటికి ఎమ్మెల్యే (ఎక్ష్​ అపీసీయే) హాజరు కాలేదు. దాంతో కాంగ్రెస్​కు మద్దతుదారుల సంఖ్య 9కే పరిమితమైయ్యారు. బీఆర్ఎస్​ గెలుపోందిన 13, ఒక బీజేపీ, ఒక స్వతంత్ర అభ్యర్ధితో కలిపి 15 మంది చైర్మన్​ అభ్యర్ధియైన సుదర్శన్​ రెడ్డికి మద్దతుగా నిలిచారు. అధికారికంగా ప్రకటించాల్సిన అబ్జర్వార్​ మయాంక్​ మిట్టల్ సమావేశం హాల్​ నుంచి మద్యలోనే బయటికి వెళ్లిపోయారు. హైకోర్టు ఇచ్చిన స్టే అర్డర్​తోనే నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బీఆర్ఎస్​ కౌన్సిలర్లు స్టే అర్డర్​ చూపించాలని పట్టుబడటంతో ఫలితం లేకుండా పోయింది. సాయంత్రం 6 గంటల వరకు సభ్​యులు హాల్​లోనే ఉదయం నుంచి నిరీక్షణ చేయడం విశేషం.

హైకోర్టు నిర్ణయం తర్వాతే ఎన్నిక

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను రిటర్నింగ్ అధికారులు మళ్లీ వాయిదా వేశారు. కొర్టు నిర్ణయం వెల్లడించే వరకు ఎన్నిక ప్రక్రియను నిర్వహించలేమని అధికారులు వెల్లడించారు. కేవలం హైకోర్టు స్టే రావడంతోనే ఎన్నిక నిలిచిపోయిందని, ఎవరి ఓత్తడి, ప్రలోభాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. తదుపరి నిర్ణయం హైకోర్టు సూచనల ప్రకారం జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి తెలిపారు.

Also Read: Minister Seethakka: గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Related News

వరంగల్ ఎయిర్‌పోర్టు గురించి శుభవార్త.. నిధులపై మంత్రి ప్రకటన, టెండర్లు ఆహ్వానంతో

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

Big Stories

Advertisement
×