E-Paper
Advertisement

‘పెద్ది’ కోసం దర్శకుడి 10 లక్షల మొక్కు.. వైరల్ అవుతున్న బుచ్చిబాబు కామెంట్స్!

‘పెద్ది’ కోసం దర్శకుడి 10 లక్షల మొక్కు.. వైరల్ అవుతున్న బుచ్చిబాబు కామెంట్స్!
Advertisement

Peddi Secrets : పెద్ది …ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటింగ్ సినిమా ఎట్టకేలకి జూన్ 4న థియేటర్లలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది.ఈ క్రమంలో సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చేందుకు ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్ .ఈ సందర్భంగా సినిమా గురించి, సినిమా వెనకాల జరిగిన పలు ఆసక్తికరమైన విషయాలని మీడియాతో పంచుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు సానా.

సినిమా ఎలా ఉంటుంది అంటే 

Advertisement

సినిమా గురించి మాట్లాడుతూ… స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో ఆట మాత్రమే కాకుండా, అంతకుమించి ‘సెల్ఫ్ రెస్పెక్ట్’ (ఆత్మగౌరవం) అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుందని బుచ్చిబాబు స్పష్టం చేశాడు. ఇక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఇది ఎవరి బయోపిక్ కాదని, తన ఊరిలో ఉండే ‘పెద్ది’ అనే ఒక సాధారణ కుర్రాడి నిజ జీవితంలోని కొన్ని సంఘటనలని బేస్ చేసుకుని అల్లిన ఒక ఫిక్షనల్ స్టోరీ అని వివరించారు. రోజువారీ కూలికి వెళ్తూ, 150 రూపాయలు ఇస్తే ఎవరి తరఫునైనా క్రికెట్ ఆడే ఒక సాధారణ యువకుడి జీవితంలోకి ‘సెల్ఫ్ రెస్పెక్ట్’ అనే పాయింట్ వస్తే ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ సినిమా అని చెప్పుకొచ్చాడు.

also read: రణబీర్ కపూర్ నెక్స్ట్ హోమ్ అయోధ్యలోనేనా? కోట్లు పెట్టి కొన్న స్థలం డీటెయిల్స్ ఇవే!

Advertisement

ఇందులో చరణ్ చెరకు మిల్లులో పనిచేసే కుర్రాడిగా రగ్గడ్ లుక్‌లో కనిపిస్తుండగా, హీరోయిన్ జాన్వీ కపూర్ విజయనగరం రాజుల వంశానికి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ సీన్‌లో జాన్వీ కపూర్ చూపించిన ఫెర్ఫామెన్స్ మెస్మరైజ్ చేస్తుందని,అందుకే తను అందగత్తె మాత్రమే కాదు, అద్భుతమైన నటి అని ఆకాశానికి ఎత్తాడు బుచ్చిబాబు.

రెహమానే ఎందుకంటే 

ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం ఒక పెద్ద హైలైట్ అని,ఇప్పటివరకు తెలుగులో రెహమాన్ నేరుగా చేసిన ‘కొమరం పులి’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన కేవలం ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ కథకు ఆయన్నుతీసుకున్నట్టు తెలిపాడు. తన మొదటి సినిమా ‘ఉప్పెన’ సక్సెస్ అవడానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఎంతో ఉపయోగపడిందని చెబుతూనే రెహమాన్‌తో పనిచేయాలనే తన కల ఈ సినిమాతో నెరవేరిందని చెప్పాడు. సాంగ్ రికార్డింగ్ సమయంలో సాధారణంగా రెహమాన్ తన ఫైనల్ వాయిస్‌తో అవుట్‌పుట్ ఇవ్వరని, కానీ ఈ సినిమాలోని ‘రయ్ రయ్ రారా’ అనే పాటను తన కోరిక మేరకు రెహమాన్ స్వయంగా పాడి ఇచ్చారని తెలిపాడు. నిజానికి ఆ పాటను వేరే సింగర్స్‌తో పాడించినప్పటికీ, చివరికి రెహమాన్ బేస్ వాయిస్ ఉన్న మ్యాజిక్కే బాగుండటంతో దాన్నే ఫిక్స్ చేశారట.రెహమాన్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ ఎలాంటి ఇగోలకి పోకుండా దర్శకుడి విజన్‌ ని రెస్పెక్ట్ చేస్తూ
అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు.

also read: నడిచే కూలర్ ..ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఢిల్లీ డ్రైవర్ వీడియో!

స్వామివారికి పది లక్షల విలువైన కిరీటం 

ఇక సినిమా కథ చరణ్ కి వినిపించగానే సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేశాడని,ఎలాంటి చేంజెస్ చెప్పలేదని వెల్లడించాడు.తనకు సెంటిమెంట్లు ఎక్కువని, ఎప్పుడూ జేబులో దేవుడి ఫోటో పెట్టుకుంటానని చెబుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశాడు..తాను పిఠాపురం దత్తాత్రేయ స్వామిని బలంగా నమ్ముతానని, చరణ్‌కు కథ చెప్పడానికి వెళ్లే ముందు.. ఆయన ఎలాంటి మార్పులు చెప్పకుండా సింగిల్ సిట్టింగ్‌లో ఓకే అంటే స్వామివారికి పది లక్షల రూపాయల విలువైన కిరీటాన్ని చేయిస్తానని మొక్కుకున్నానని,చరణ్ కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆ మొక్కును వీలైనంత త్వరగా తీర్చాలని ఇప్పుడు తన భార్యకు కూడా చెప్పినట్లు అసలు విషయం చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు.

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని స్ప్రుష్టిస్తుందో

‘ఉప్పెన’ సినిమాతో వంద కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిన బుచ్చిబాబు, ఇప్పుడు రామ్ చరణ్‌తో చేస్తున్న ఈ రెండో సినిమా 2026 బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా స్థాయిలో వెయ్యి కోట్ల వసూళ్లను సాధిస్తుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆ స్థాయి సక్సెస్ వస్తే అంతకంటే ఆనందం ఏముంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ వర్క్ కోసం, వారి డేట్స్ కోసం వేచి ఉండటం సహజమని, చరణ్ కోసం ఐదేళ్లు వెయిట్ చేసినా తప్పులేదని అన్నారు. ఫ్యూచర్లో తనకు నచ్చిన ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు వంటి స్టార్స్‌తో వర్క్ చేసే అవకాశం వస్తే ఎంత కాలమైనా వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బుచ్చిబాబు సానా మనసులోని కోరికని బయటపెట్టేశాడు.చూడాలి మరి కోట్లాది ఆశగా ఎదురుచూస్తున్నపెద్ది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని స్ప్రుష్టిస్తుందో !

also read: దళపతి విజయ్ నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ పీఠమేనా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి జోస్యం

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×