E-Paper
Advertisement

Globe Trotter Event : రుద్ర పాత్రలో మహేష్ బాబు… గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో!

Globe Trotter Event : రుద్ర పాత్రలో మహేష్ బాబు… గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో!
Advertisement

Globe Trotter Event: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్రాండ్ ఈవెంట్ గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో ప్రేక్షకుల రాబోతున్న సినిమాకు సంబంధించిన ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వీడియోని కూడా విడుదల చేశారు. అందరూ ఊహించిన విధంగానే ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ప్రకటించారు. ఇక ఈ గ్లింప్ వీడియోలో భాగంగా మహేష్ బాబు నంది పై ఎంట్రీ ఇచ్చే సన్నీ వేషాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని చెప్పాలి. ఈ వీడియో అభిమానులు ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉందని చెప్పాలి.

రుద్ర పాత్రలో మహేష్ బాబు..

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర (Rudra) పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా వెల్లడించారు. ఇలా మహేష్ బాబు రుద్ర పాత్రలో, నంది పై త్రిశూలం పట్టుకొని ఎంట్రీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ గ్లింప్ వీడియోని విడుదల చేయడంతో ఒక్కసారిగా చిత్ర బృందం మొత్తం ఎమోషనల్ అయ్యారు. ఇక అభిమానులకు కూడా మహేష్ బాబుని రుద్ర పాత్రలో చూస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఈయన కుంభ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక నటి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

వారణాసి టైటిల్ ఫిక్స్..

Advertisement

ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మందాకిని పాత్రలో కనిపించబోతున్నారు. ఇక నేడు జరిగిన ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించబోతున్నారని ఈ సినిమాకు వారణాసి(Varanasi) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు రాజమౌళి అధికారికంగా వెల్లడించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని 2027 సమ్మర్లో విడుదల చేయబోతున్నట్లు కీరవాణి ఈ కార్యక్రమంలో భాగంగా వెల్లడించారు.

Advertisement

ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఏ విధంగా కష్టపడుతున్నారో ఒక్క గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ చూస్తేనే స్పష్టం అవుతుంది..RRR సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్న రాజమౌళి వారణాసి సినిమాని అంతకుమించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: Globe Trotter Event: మహేష్ రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. లీక్ చేసిన కీరవాణి!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×