E-Paper
Advertisement

Globe Trotter Event: మహేష్ బాబు గొప్ప అలవాటు… ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్న రాజమౌళి!

Globe Trotter Event: మహేష్ బాబు గొప్ప అలవాటు… ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్న రాజమౌళి!
Advertisement

Globe Trotter Event: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికే దక్కిందని చెప్పాలి. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీకి ఆమడ దూరంలో ఉన్న ఆస్కార్ అవార్డు కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి మొదటి ఆస్కార్ అవార్డు అందించిన ఘనత రాజమౌళికి ఉందని చెప్పాలి. క్రమశిక్షణ, నియమ నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన రాజమౌళి నుంచి ఎన్నో విషయాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉంటుంది అలాంటి రాజమౌళి మహేష్ బాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ పై రాజమౌళి ప్రశంసలు..

తాజాగా నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) కార్యక్రమంలో భాగంగా రాజమౌళి, మహేష్ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కూడా మహేష్ బాబు నుంచి ఒక గొప్ప అలవాటును నేర్చుకోవాలని ఆయనకున్న మంచి అలవాటు గురించి తెలిపారు. మహేష్ బాబు సోషల్ మీడియాలో సినిమాలకు సంబంధించిన పోస్టులు వేస్తుంటారు అయితే ఆ పోస్టులు చూస్తే ఈయన నిత్యం సెల్ ఫోన్ లోనే గడుపుతారని అందరూ భావిస్తారు కానీ అది నిజం కాదని తెలిపారు.. మహేష్ బాబు ఒకసారి షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టిన తర్వాత తన మొబైల్ ఫోన్ తన కారులోనే ఉంటుంది . షూటింగ్ పూర్తి అయ్యేవరకు మహేష్ బాబు ఫోన్ ముట్టుకోరని అది 6 గంటలైనా పది గంటలైనా సరే ఫోన్ తీసుకోరు అంటూ మహేష్ బాబులో ఉన్న గొప్ప అలవాటు గురించి రాజమౌళి వెల్లడించారు.

వారణాసి..

Advertisement

రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడు మహేష్ బాబు లో ఉన్న ఈ అలవాట్లను నేర్చుకోవాలని చెప్పడంతో అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక మహేష్ బాబు సూపర్ స్టార్ అయినప్పటికీ ఎంతో సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక మహేష్ బాబు మొదటిసారి రాజమౌళితో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా SSMB 29 అనే టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంది. తాజాగా ఈ కార్యక్రమానికి వారణాసి (Varanasi)అనే టైటిల్ పెట్టినట్లు చిత్ర బృందం వెల్లడించారు.

రుద్రగా మహేష్ బాబు..

Advertisement

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ తో పాటు మహేష్ రుద్ర (Rudra)అనే పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాని 2027 వేసవి సెలవులలో విడుదల చేయబోతున్నట్లు తాజాగా కీరవాణి తెలియజేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కుంభ పాత్రలో కనిపించబోతున్నారు.

Also Read: Globe Trotter Event: మహేష్ రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. లీక్ చేసిన కీరవాణి!

Related News

‘టాక్సిక్’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రొమాంటిక్ మోడ్‌లోకి రాకింగ్ స్టార్!

“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Big Stories

Advertisement
×