E-Paper
Advertisement

Nalgonda drugs: పోలీసులకే షాక్ ఇచ్చిన గంజాయి స్మగ్లర్ల ‘లేడీ గెటప్’ స్కెచ్.. చివరికి ఏమైందంటే?

Nalgonda drugs: పోలీసులకే షాక్ ఇచ్చిన గంజాయి స్మగ్లర్ల ‘లేడీ గెటప్’ స్కెచ్.. చివరికి ఏమైందంటే?
Advertisement

Nalgonda drugs: ఒడిశా నుంచి మహారాష్ట్రకు భారీగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో నల్గొండ ఎక్సైజ్ అధికారులు పం తంగి టోల్‌గేట్ వద్ద నిఘా పెట్టారు. రామన్నపేట సీఐ బాలోజీ నాయక్, మోత్కూర్ సీఐ రవిచంద్ర రెడ్డి నేతృత్వంలోని బృందం తనిఖీలు చేపట్టగా.. ఆటోలో రహస్యంగా తరలిస్తున్న 60.685 కిలోల గంజాయి బయటపడింది. పోలీసుల కళ్లు గప్పేందుకు నిందితులు మహిళలను వెంటబెట్టుకుని ప్రయాణించడం గమనార్హం. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన గంగూభాయ్ పాండురంగ చౌహార్, కమల్ అర్జున్ మోతెతో పాటు నల్గొండకు చెందిన దాసు వేణుకుమార్‌ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 33 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయిదేళ్ల తర్వాత చిక్కిన డ్రగ్ పెడ్లర్

Advertisement

మరో కేసులో.. గత ఐదేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ ఉల్లంగి వెంకటేశ్‌ను మల్కాజిగిరి డీటీఎఫ్ అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండి హాష్ ఆయిల్‌ను సేకరించి హైదరాబాద్‌లో విక్రయిస్తుంటాడు. నారపల్లి అటవీ ప్రాంతంలో మాటు వేసిన సీఐ భరత్ భూషణ్ బృందం నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుంచి 5 లక్షల విలువైన 1.04 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల అభినందనలు

Advertisement

ఈ ఆపరేషన్లలో ప్రతిభ కనబరిచిన సీఐలు శంకర్, శివకృష్ణ, సత్యనారాయణ , ఇతర కానిస్టేబుళ్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షా నవాజ్ ఖాసీం, మల్కాజిగిరి సూపరింటెండెంట్ నవీన్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×