E-Paper
Advertisement

AP Govt: హిడ్మా ఎదురుకాల్పుల్లో హతం, ఆ వార్తల్లో వాస్తవం లేదు, ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ క్లారిటీ

AP Govt: హిడ్మా ఎదురుకాల్పుల్లో హతం, ఆ వార్తల్లో వాస్తవం లేదు, ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ క్లారిటీ
Advertisement

AP Govt: మారేడుమిల్లి ఎదురు కాల్పుల్లో హిడ్మా మృతి చెందినట్టు ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఆయన్ని పట్టుకున్న తర్వాత కాల్చి చంపారనే వార్తల్లో ఏ మాత్రం వాస్తవంలేదన్నారు. హిడ్మా జర్నలిస్టులకు లేఖ రాయడం గురించి తమకు తెలీదన్నారు. త్వరలో చాలామంది మావోయిస్టులు లొంగిపోతారని చెప్పుకొచ్చారు.

హిడ్మా ఎదురుకాల్పుల్లో హతం- ఏపీ ఇంటెలిజెన్స్‌ క్లారిటీ

Advertisement

మంగళవారం ఉదయం మారేడుమిల్లి ఎన్‌కౌంటర్, ఏపీలోని ఐదు ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టుల అరెస్టుపై ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా వివరాలు వెల్లడించారు.  బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్‌ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల ఫ్యూచర్ ప్లాన్‌ ఏంటో తెలీదుని, కానూరులో ఎందుకున్నారో అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

మావోయిస్టుల అరెస్టుల వల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మావోయిస్టులు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నిఘా వర్గాలు ఇచ్చిన సూచనలతో వారి కదలికలపై దృష్టి పెట్టారని వివరించారు.

Advertisement

హిడ్మా పేరుతో వైరల్ అవుతున్న చివరి లేఖ

మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో 50 మందిని పట్టుకోవడం ఇదే తొలిసారన్నారు.

కేంద్ర-రాష్ట్ర-ఏరియా-కమిటీ సభ్యులు-ఫ్లాటూన్ టీమ్‌లను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని నుంచి భారీగా ఆయుధాలు, రెండు మ్యాగజైన్, పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశామని, అందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. మంగళవారం మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ తర్వాత పలువురు మావోయిస్టులు పారిపోయారని, వారి కోసం గాలింపు తీవ్రతరం చేసినట్టు వెల్లడించారు.

ALSO READ:  రంపచోడవరంలో భారీ ఎన్‌కౌంటర్, ఏడుగురు మావోయిస్టులు హతం 

తెలంగాణలో కొద్దిరోజుల కింద కొంతమంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని తెలిపారు. వారి ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోలు భావించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలోని పలు ప్రాంతాలను ఎంపిక చేసినట్టు వివరించారు. ఛత్తీస్‌ఘడ్‌లో పరిస్థితులు చక్కబడిన తర్వాత వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మావోయిస్టుల కదలికలు, వారి ప్లాన్ల గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు.

హిడ్మా పేరుతో వైరల్ అవుతున్న లేఖలోని కొన్ని అంశాలను ఈ విధంగా ఉన్నాయి.  లొంగిపోయిన మావోయిస్టు నాయకులు సోను, సతీష్ లను అవకాశవాదులుగా పేర్కొన్నారు. మోసం చేసి క్యాడర్ లొంగిపోయేలా చేశారన్నారు. పార్టీ లైన్‌ను వక్రీకరించి ప్రజలకు చూపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాలను వదిలేది లేదని, లొంగిపోయిన మావోయిస్టు క్యాడర్లు పునరాలోచించాలన్నారు. హిడ్మా చివరి లేఖ పేరులో పైఅంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×