E-Paper
Advertisement

Global Summit 2025: సీఎం రేవంత్ రెడ్డి రియ‌ల్ లెజెండ్..క్రీడాకారుల ప్ర‌శంస‌లు

Global Summit 2025: సీఎం రేవంత్ రెడ్డి రియ‌ల్ లెజెండ్..క్రీడాకారుల ప్ర‌శంస‌లు
Advertisement

Global Summit 2025: తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ చాలా గ్రాండ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, విదేశీ కంపెనీల ప్రతినిధులు, క్రీడాకారులు అందరూ హాజరయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రగతి అమాంతం పెరిగిపోయింది. గడిచిన 10 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రగతిని ప్రపంచ స్థాయికి చాటారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బున్న లేకపోయినా క్రీడాకారులు లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు క్రికెటర్ అంబటి రాయుడు. గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు క్రీడారంగంపై జరిగిన ప్యానల్ డిస్కషన్ లో పాల్గొన్న ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు.. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్యానల్ డిస్కషన్ లో తన సందేశాన్ని ఇచ్చారు అంబటి రాయుడు. సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి త‌ప్పుకున్న జియో హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్‌..రంగంలోకి నెట్ ఫ్లిక్స్ ?

సీఎం రేవంత్ రెడ్డి రియ‌ల్ లెజెండ్

Advertisement

తెలంగాణకు ఇది గొప్ప అవకాశం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ ఇన్ఫాస్ట్రక్చర్ని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం చాలా గొప్ప విషయం అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతోందని చెప్పారు. గ్రామీణ స్థాయిలో జిల్లా స్థాయిలో క్రీడలకు పెద్దపీట వేయడం.. మౌలిక సదుపాయాలు కల్పించడం అని వివరించారు. యువ క్రీడాకారులకు ఒక వరం లాంటిది..ఇది గొప్ప అవకాశం అని తెలిపారు.

క్రీడారంగనికి పెద్దపీట వేసిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి.. చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా క్రీడాకారులు ముందుకు రావాలి.. అప్పుడు ప్రభుత్వాలు సహకరిస్తాయని స్పష్టం చేశారు అంబటి రాయుడు. డబ్బులున్నా లేకపోయినా దేశం కోసం మేము ఆడగలమని లక్ష్యంతో క్రీడాకారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభ ప్రభుత్వాలు గుర్తించగలుగుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. స్పోర్ట్స్ పాలసీ వల్ల సమాజంలో ఐకమత్యం పెరుగుతుందని వివరించారు.
హెల్దీ బాడీ.. హెల్దీ మైండ్ మంచి సమాజానికి స్పోర్ట్స్ అనేది ప్రధానం అన్నారు. క్రికెట్ క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు సదుపాయాలు ఎంకరేజ్మెంట్ ఉందన్నారు. నా జీవితమంతా హైదరాబాద్ కి క్రికెట్ ఆడాను..ఫ్యూచర్ సిటీలో కూడా క్రీడా రంగానికి అద్భుతమైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు అంబటి రాంబాబు.

క్రీడాకారులకు సరైన గైడెన్స్ చాలా అవసరం

Advertisement

తెలంగాణలో మహిళా క్రీడాకారులు ఎన్నో మెడల్స్ గెలుస్తున్నారని అటు పీవీ సింధు పేర్కొన్నారు.
మనం ముందుకు వచ్చి వాళ్లకి సపోర్ట్ చేస్తే నెంబర్ వన్ గా నిలుస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి సహకారం అందిస్తుందని తెలిపారు. క్రీడాకారులకు సరైన గైడెన్స్ చాలా అవసరం
అని అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×