E-Paper
Advertisement

Maheshbabu: మహేష్ సమర్పణలో మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Maheshbabu: మహేష్ సమర్పణలో మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement

Maheshbabu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu ) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. ఇంకొక వైపు మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన ప్రస్తుతం రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ గుర్తింపును సొంతం చేసుకోవడానికి అంతర్జాతీయంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దిగ్గజ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇందులో ఏకంగా రాముడు, రుద్ర పాత్రల్లో మహేష్ బాబు నటిస్తున్నారు.

మహేష్ బాబు సమర్పణలో సినిమా..

Advertisement

ఇలా ఒకవైపు తన సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు కొన్ని చిత్రాలను ప్రజెంట్ చేస్తూ బిజీగా మారిపోయారు. అందులో భాగంగానే తాజాగా ఆయన సమర్పణలో వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. టాలీవుడ్ లో టాలెంటెడ్ నటుడుగా పేరు దక్కించుకున్న హీరో సత్యదేవ్ (Sathyadev ) హీరోగా రూపొందుతున్న చిత్రం ఇది. వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సైకాలజికల్ డ్రామా జానర్ లో తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) ప్రెసెంట్ చేస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో సత్యదేవ్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదల తేదీ పై ఊహించని కామెంట్లు చేశారు.

రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన సత్యదేవ్..

సత్యదేవ్ మాట్లాడుతూ..” ఈ రావు బహదూర్ సినిమా మే 2026 లో సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది” అంటూ ఆయన కామెంట్లు చేయడంతో ఇక సమ్మర్ కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భిన్నమైన జానర్ లలో ప్రేక్షకులను ఆకట్టుకునే సత్యదేవ్ ఈసారి అంతకుమించి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయారని చెప్పాలి. ఇకపోతే ఈ చిత్రం సత్యదేవ్ కి మాత్రమే కాదు మహేష్ బాబు నిర్మాణ బృందానికి కూడా కీలకమైన ప్రాజెక్టుగా మారనుంది అని చిత్ర సీమలో చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే సత్యదేవ్ మేకోవర్ అందర్నీ ఆకట్టుకుంది. పైగా వృద్ధిడి గెటప్ లో ఆయన కనిపించిన తీరు తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

also read:Radhika: చిరంజీవి, మోహన్ లాల్.. బెస్ట్ యాక్టర్ ఎవరు? రాధిక ఊహించని కామెంట్స్ ..!

రావు బహదూర్ సినిమా విశేషాలు..

సినిమా నుండి టీజర్ విడుదలైన తర్వాత ప్రేక్షకులలో ఆసక్తి రెట్టింపు అయింది. ఇక ఈ సినిమాను మహేష్ బాబు సమర్పిస్తుండగా.. A+S మూవీస్.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. దీప థామస్, వికాస్ ముప్పల, బాల పరసర్, ఆనంద్ భారతి, కునాల్ కౌశిక్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ సినిమా డేట్ ని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా మహేష్ బాబు సమర్పణలో సినిమా రాబోతుందని తెలియడంతో అటు ఘట్టమనేని అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను అందజేస్తుందో చూడాలి.

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×