E-Paper
Advertisement

Rahul Gandhi: హై అలర్ట్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ఢిల్లీ బీజేపీ పిలుపు

Rahul Gandhi: హై అలర్ట్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి ఢిల్లీ బీజేపీ పిలుపు
Advertisement

Rahul Gandhi: ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారత్ మండపంలో యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన వినూత్న నిరసనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. అమెరికా-భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ, ప్రధాని మోడీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ అర్థనగ్న ప్రదర్శన చేయడం పట్ల బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడించాలని ఢిల్లీ బీజేపీ పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ కృష్ణహరి, బీహార్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుందన్ యాదవ్, యూపీ వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్, మహబూబ్‌నగర్‌కు చెందిన నేషనల్ కోఆర్డినేటర్ నరసింహ యాదవ్ వంటి కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమిట్ వంటి అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఆందోళనలు చేపట్టడం దేశ ప్రతిష్టను దిగజార్చడమేనని బీజేపీ మండిపడుతోంది. అరెస్టయిన నేతలను పోలీసులు పాటియాలా కోర్టులో హాజరుపరిచి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

అయితే నిన్నటి నుండే ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. భారత మండపం ఘటనకు నిరసనగా బీజేపీ యువ మోర్చా నాయకులు రాహుల్ గాంధీ నివాసం వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలైన NSUI, యూత్ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే అంతర్జాతీయ వేదికల వద్ద రచ్చ చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. దేశాభివృద్ధికి కీలకమైన వాణిజ్య ఒప్పందాలను రాజకీయం చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఒక శక్తిగా ఎదుగుతున్న తరుణంలో, ఇలాంటి అనాలోచిత నిరసనలు ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. రాహుల్ గాంధీ ప్రోద్బలంతోనే ఈ తరహా ఆందోళనలు జరుగుతున్నాయని భావిస్తున్న బీజేపీ, నేరుగా ఆయన నివాసాన్ని ముట్టడించడం ద్వారా తమ నిరసనను ఢిల్లీ వేదికగా బలంగా వినిపించాలని నిర్ణయించుకుంది. దీంతో రాహుల్ గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Advertisement

Also Read: ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న‌ వందే భారత్ రైలుపై రాళ్ల దాడి..

ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవైపు యూత్ కాంగ్రెస్ నేతల అరెస్టులు, మరోవైపు బీజేపీ ముట్టడి పిలుపుతో దేశ రాజధానిలో రాజకీయ పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పార్లమెంట్ లోపల, వెలుపల మరిన్ని వాదోపవాదాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×