E-Paper
Advertisement

BB Jodi 2 : శ్రీసత్యతో శేఖర్ మాస్టర్ రొమాంటిక్ డ్యాన్స్.. పెళ్లివరకు వెళ్లిన సదా..ఇది కదా అసలు ట్విస్ట్..

BB Jodi 2 : శ్రీసత్యతో శేఖర్ మాస్టర్ రొమాంటిక్ డ్యాన్స్.. పెళ్లివరకు వెళ్లిన సదా..ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

BB Jodi 2 : బిగ్ బాస్ లోని టాప్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడీ సీజన్ 2 ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో వారాలను పూర్తి చేసుకున్న ఈ షోలో తాజాగా ఈవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. ప్రతి వారం ఏదో ఒక థీమ్ ఇచ్చి జోడీల మధ్య పోటీ పెడుతుంటారు. అయితే ఈసారి డైరెక్టర్స్ స్పెషల్ రౌండ్ అంటూ ఇచ్చారు.. మొన్నేమో త్రిబుల్ ఎస్ వచ్చారు. ఇప్పుడేమో ఇలా కాస్ట్యూమ్స్ మార్చేశారు ఏంటి మ్యాటర్ అని ప్రదీప్ జడ్జిలని అడుగుతాడు.. మొన్నేమో పరిచయాలు ఇక పెళ్లే మిగిలింది అని సదా అనడంతో అక్కడి వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వుతారు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ లో శ్రీ సత్య అర్జున్ డాన్స్ హైలెట్గా నిలిచింది. శేఖర్ మాస్టర్ శ్రీ సత్య పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకసారి ఈ ప్రోమో హైలెట్స్ చూసేద్దాం..

శ్రీసత్యతో శేఖర్ మాస్టర్ రొమాంటిక్ స్టెప్స్.. 

ఈవారం బీబీ జోడి ప్రోమోను రిలీజ్ చేశారు.. ఈ ప్రోమోలో ముందుగా శ్రీ సత్య అలాగే అర్జున్ అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇసుకలో రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ చేశారు.. ఈ పర్ఫామెన్స్ పై జడ్జిలు ఫిదా అయ్యారు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ శ్రీ సత్య స్టెప్పులపై ప్రశంసలు కురిపించారు. ఆయన హీరోయిన్ మెటీరియల్ నువ్వు అంటూ శ్రీ సత్య ను పొగిడేశారు. అయితే యాంకర్ ప్రదీప్ వచ్చి ఈయన రొమాంటిక్ స్టార్ కదా ఆయనతో కలిసి కొన్ని స్టెప్పులు వేయాలి అని శ్రీ సత్యతో అనగానే ఆమె వెంటనే ఒప్పేసుకుంటుంది. ఇద్దరు కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేస్తారు. ఎపిసోడ్కి ఇదే హైలెట్గా నిలుస్తుంది. ఈ ప్రోమో వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read : మా పెళ్లి జరగడానికి కారణం అదే.. టాప్ సీక్రెట్ ను బయటపెట్టేసిందిగా..!

నైనిక పెర్ఫార్మన్స్ అదుర్స్..

ఇక చివరిగా నైనిక అలాగే అమర్దీప్ డాన్స్ తో అదరగొట్టేస్తారు.. ఐటెం సాంగ్స్ అన్నిటితోను డాన్స్ చేస్తారు. నైనిక పర్ఫామెన్స్ పై జడ్జిలు పొగడ్తల వర్షం కురిపిస్తారు. డాన్స్ క్వీన్ అంటూ అంటారు. కిస్సిక్’ సాంగ్‌కి అమర్-నైనిక బ్లాస్టింగ్ పెర్ఫామెన్స్ చేశారు..డైరెక్టర్‌కి ట్రిబ్యూట్ ఇవ్వాలంటే ఇలా ఉండాలి.. అంటూ సదా అన్నారు. శేఖర్ మాస్టర్ అయితే కాలర్ ఎగరేస్తూ నైనికని తన మాటలతో ఆకాశానికి ఎత్తేశారు.. ఆ తర్వాత నైనిక వాళ్ళ మదర్ స్టేజ్ మీదకు రావడంతో మీరు ఇలాంటి కూతురు ఉండడం చాలా అదృష్టం.. మీకు కూతురుగా పుట్టడం ఆమె అదృష్టం అంటూ శేఖర్ మాస్టర్ అంటారు. మీ కొరియోగ్రాఫర్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలంటూ శ్రీదేవి కొనియాడారు. గోవింద్.. ఈ సాంగ్ సుకుమార్ గారికి నేనే పంపిస్తాను.. అంటూ శేఖర్ మాస్టర్ మాటిచ్చారు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. చూస్తుంటే ఈ ఎపిసోడ్ మొత్తం రొమాంటిక్ సాంగ్స్ తో యూత్ ని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×