E-Paper
Advertisement

రైలు ప్రయాణికులకు గమనిక.. కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్, రైళ్ల రాకపోకలకు అంతరాయం

రైలు ప్రయాణికులకు గమనిక.. కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్, రైళ్ల రాకపోకలకు అంతరాయం
Advertisement

kovvur: విజయవాడ వైపు వెళ్తున్న ఓ గూడ్స్ గోదావరి జిల్లాలో పట్టాలు తప్పింది. నాలుగో లైన్‌లో పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేసింది రైల్వేశాఖ. సమీపంలోని రైల్వే స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. గూడ్స్ పట్టాలు తప్పిన కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్

Advertisement

తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీని కారణంగా రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ వైపు ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు.. కోవ్వూరు స్టేషన్ వద్ద నాలుగో రైల్వే లైన్‌పై వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఫలితంగా కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన తర్వాత పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన విషయం తెలియగానే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

Advertisement

పునరుద్ధరణ, ట్రాక్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టారు. రైలు పట్టాలు తప్పడానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఇటు తూర్పు గోదావరి.. అటు పశ్చిమ గోదావరిలో రైళ్ల ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నిడదవోలు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో కొన్ని రైళ్లు నిలిచిపోయాయి. ఉన్నట్లుండి రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు షాకయ్యారు.

ALSO READ: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ సిటీలో చినుకులు..

ఈ ప్రమాదంతో గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో ఈ లైన్‌లో ప్రయాణించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైల్వే ట్రాక్‌లను పునరుద్దరించేందుకు ముమ్మరం చేశారు అధికారులు. రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×