Tourist Family Director: సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. తలైవర్ 173వ చిత్రం కోసం అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా కాంబో సెట్ అవ్వడం లేదు. ఈ సినిమా మల్టీస్టారర్‌గా రాబోతుందని, ఇందులో రజనీ, కమల్ హాసన్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు నిర్మాత కూడా కమల్ హాసనే.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి నిర్మాత దొరికిన డైరెక్టర్ దొరకడం లేదు. ఇప్పటికీ ఇద్దరు డైరెక్టర్లు ఈ చిత్రం నుంచి వైదొలిగారు. మొదట లోకేష్ కనగరాజ్‌తో చేస్తున్నట్టు ప్రకటన కూడా వచ్చింది. కానీ, కూలీ తర్వాత రజనీ డైరెక్టర్‌ని నో చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లోకి సుందర్ సి వచ్చారు. ఆయన స్టోరీ లైన్ మెచ్చిన రజనీ సుందర్ సికి ఒకే చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఫుల్ స్క్రిప్ట్ వినిపించడంతో నచ్చకపోవడంతో రజనీ సుందర్ సికి కూడా నో చెప్పారట.
ఇటీవల సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో తలైవర్ 173వ చిత్రం మరింత హాట్ టాపిక్ అయ్యింది. డైరెక్టర్ కోసం కమల్ తీవ్రంగా వెతుకుతున్నారు. కానీ, ఇంక సెట్ అవ్వడం లేదు. ఈ క్రమంలో ఓ యంగ్ డైరెక్టర్‌కి ఓకే చెప్పినట్టు కోలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. ఇండస్ట్రీలో అభిషాన్ జీవింత్ పేరు బాగా వినిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిషాన్ తన అప్‌కమ్మింగ్ ప్రాజెక్ట్స్‌పై పెదవి విప్పారు. అభిషాన్ జీవింత్ ఇటీవల ఓ కోలీవుడ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన రజనీకాంత్, కమల్ హాసన్‌లో మూవీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు.
Alsp Read: Actor Dharmendra: బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
“అలాంటిది ఏం లేదు. ఇంకా నేను నా నెక్ట్స్ మూవీ స్క్రిప్ట్ రాస్తున్నారు. అంత సెట్ అయ్యాక. త్వరలోనే ప్రకటన ఇస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టండి” అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ వార్తలను మాత్రం పూర్తిగా ఆయన ఖండించలేదు. సూర్య, రజనీకాంత్, కమల్ హాసన్ సినిమా చేస్తున్నారా? అని అడగ్గానే అభిషాన్ చిన్న నవ్వు నవ్వారు. కానీ, లేదని మాత్రం గట్టిగా చెప్పలేదు. అంటే ఈ వార్తలు నిజమే అని ఆయన చెప్పకనే చెప్పినట్టు ఉంది అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తున్నానని, అంత సెట్ అయ్యాక తానే స్వయంగా ప్రకటిస్తానని అన్నారు. అంటే అది రజనీ, కమల్ మూవీ గురించే అయ్యింటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదంత చూస్తుంటే ఈ వార్తలు నిజమే అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.