E-Paper
Advertisement

Smriti Mandhana Wedding: బ్రేక‌ప్‌.. హ‌ల్దీ ఫోటోలు డిలీట్ చేసిన స్మృతి మందాన..ప‌లాష్ తో పెళ్లి ర‌ద్దు ?

Smriti Mandhana Wedding: బ్రేక‌ప్‌.. హ‌ల్దీ ఫోటోలు డిలీట్ చేసిన స్మృతి మందాన..ప‌లాష్ తో పెళ్లి ర‌ద్దు ?
Advertisement

Smriti Mandhana Wedding: టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana) పర్సనల్ జీవితం దారుణంగా తయారైంది. ఆరు సంవత్సరాల పాటు పలాష్ ముచ్చల్ ను (  Palash Muchhal) పెళ్లి చేసుకుని, లైఫ్ లో హ్యాపీగా ఉండాలని అనుకున్నా స్మృతి మందానకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. నవంబర్ 23వ తేదీ అంటే నిన్నటి రోజున పలాష్‌ ముచ్చల్, స్మృతి మందాన వివాహం జరగాల్సింది. కానీ, చివ‌రి క్ష‌ణంలో పెళ్లి ఆగిపోయింది. తాళిబొట్టు కట్టే సమయంలోనే స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని పెళ్లి మండలం నుంచే అంబులెన్స్ లోనే ఆసుపత్రికి తరలించారు. దీంతో అర్ధాంతరంగా స్మృతి మందాన వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది.

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

స్మృతి మందాన పెళ్లి వాయిదాలో మరో ట్విస్ట్

Advertisement

ఆదివారం రోజున‌ తన తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లిని వాయిదా వేసుకున్న స్మృతి మందాన, పూర్తిగా పెళ్లి రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇవాళ ఎస్డిటి అలాగే వైరల్ ఫీవర్ కారణంగా తనకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్మృతి మందాన ( Smriti Mandhana Wedding ) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు అన్నిటిని డిలీట్ చేసినట్లు సమాచారం. నిన్నటి వరకు స్మృతి ఇన్ స్టాగ్రామ్ లో హల్ది అలాగే పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఉండేవి.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. దీంతో పలాష్‌ ముచ్చల్ తో జరగాల్సిన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే పెళ్లికి సంబంధించిన ఫోటోలు అన్నిటినీ స్మృతి మందాన డిలీట్ చేసినట్లు చెబుతున్నారు. పలాష్‌ ముచ్చల్ ను ( Palash Muchhal  MArriage) పెళ్లి చేసుకోక ముందే, ఇన్ని సమస్యలు వచ్చాయి. పెళ్లి చేసుకుంటే, మరెన్ని సమస్యలు వస్తాయో? అనే భయాందోళనలో స్మృతి మందాన ఉన్నారట. ఈ నేపథ్యంలోనే పెళ్లి పూర్తిగా రద్దు చేసుకునేందుకు స్మృతి మందాన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Advertisement

అయితే స్మృతి మందాన పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు. పాపం పెళ్లి చేసుకుందామనుకున్న స్మృతి మందానకు ఇలా అనేక అడ్డంకులు రావడం చాలా దారుణమని ఎమోషనల్ అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్మృతి మందానకు అండగా నిలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఒక ఆడబిడ్డ కు ఇలాంటి సమస్యలు రాకూడదని కోరుతున్నారు. అటు తండ్రి ఇటు కాబోయే భర్త ఇద్దరు ఆసుపత్రి పాలు కావడం బాధాకరమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×