E-Paper
Advertisement

Malaika Arora: మళ్లీ తనకంటే చిన్నోడితో మలైకా డేటింగ్.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?

Malaika Arora: మళ్లీ తనకంటే చిన్నోడితో మలైకా డేటింగ్.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?
Advertisement

Malaika Arora:ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా (malaika arora) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ నటిగా , డాన్సర్ గా, మోడల్ గా, వీడియో జాకీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత కారణాలవల్లే నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మొదట అర్బాజ్ ఖాన్ (Arbaj Khan) తో 1998లో ఏడడుగులు వేసిన ఈమె.. 2016లో విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 2017 మే 11న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఈ జంటకి అర్హాన్ ఖాన్ జన్మించారు. పోతే అప్పటినుంచి నిత్యం వ్యక్తిగత విషయాలతో రూమర్లు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అందులో భాగంగానే 2016లో వయసులో తనకంటే ఏకంగా 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో రిలేషన్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత 2024లో అతడి నుంచి విడిపోయింది. మళ్లీ ఇప్పుడు మరో వ్యక్తితో ఈమె రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం.. 52 సంవత్సరాల వయసులో మళ్లీ ఈమె ప్రేమలో పడిందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. వాలంటైన్స్ డే సందర్భంగా హర్ష్ మెహతా(Harsh Mehta) అనే కుర్రాడితో మలైకా అరోరా కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇటలీలోని ట్రెవీ ఫౌంటైన్ వద్ద హర్ష్ ఆమెతో కలిసి తీసుకుంటున్నట్లు పిక్ పోస్ట్ చేశారు. నిజానికి ఇద్దరు కొన్ని రోజులుగా ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో వారి మధ్య ఏదైనా జరుగుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకపోతే కానీ తమ రిలేషన్ గురించి ఎక్కువగా ఎలాంటి కామెంట్ చేయకపోయినప్పటికీ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ప్రధమంగా వినిపిస్తున్నాయి.

ఎవరీ హర్ష్ మెహతా?

Advertisement

ఈ నేపథ్యంలోనే ఎవరీ హర్ష్ మెహతా అనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వజ్రాల వ్యాపారం చేసే సంపన్న కుటుంబం నుంచి వచ్చినట్లు సమాచారం. శాంకస్ మేనేజ్మెంట్ కి మేనేజింగ్ డైరెక్టర్ కూడా అతని నెట్ వర్త్ కూడా కోట్లల్లో ఉంటుందని సమాచారం.

also read:Nani Aaya Sher: యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న “ఆయా షేర్” సాంగ్.. 24 గంటల్లోనే!

ఇద్దరి మధ్య వయసు తేడా ఎంత?

Advertisement

ఇకపోతే ఇదే సమయంలో హర్ష్ మెహతా – మలైకా అరోరా మధ్య వయసు వ్యత్యాసం కూడా విస్తృతంగా చర్చించబడుతోంది. ఎందుకంటే వీరి మధ్య 5 – 10 సంవత్సరాలు కాదు.. ఏకంగా 19 సంవత్సరాల వయసు తేడా ఉన్నట్లు తెలుస్తోంది..ఎందుకంటే మలైకా వయసు 52 సంవత్సరాలు కాగా, హర్ష్ వయసు 33 సంవత్సరాలు.. అలా మలైక తన ప్రియుడి కంటే 19 సంవత్సరాల పెద్దది కావడం గమనార్హం . ఇదిలా ఉండగా మరొకవైపు గతంలో అర్జున్ కపూర్ తో కూడా డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు వీరిద్దరి మధ్య 12 సంవత్సరాల వయసు తేడా సంచలనం సృష్టించగా.. ఇప్పుడు ఏకంగా 19 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×