E-Paper
Advertisement

JSW Group: కొత్త దేశీ కారు బ్రాండ్ వచ్చేస్తోంది, అట్టహాసంగా JSW మోటార్స్ అనౌన్స్ మెంట్!

JSW Group: కొత్త దేశీ కారు బ్రాండ్ వచ్చేస్తోంది, అట్టహాసంగా JSW మోటార్స్ అనౌన్స్ మెంట్!
Advertisement

JSW గ్రూప్ కొత్త ఆటోమోటివ్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. JSW మోటార్స్‌ పేరుతో భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్‌ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కంపెనీ దేశ వ్యాప్తంగా డీలర్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కంపెనీ ఫస్ట్ వెహికిల్ ప్రారంభానికి ముందే, దాని అమ్మకాల నెట్‌ వర్క్ కోసం గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది.

MG మోటార్ ఇండియాలో JSWకు వాటా

ఈ కొత్త వెంచర్ JSW తన స్వంత బ్రాండ్ పేరుతో ప్యాసింజర్ వాహన విభాగంలోకి ఇండిపెండెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.  ఈ గ్రూప్ ఇప్పటికే MG మోటార్ ఇండియాలో వాటాను కలిగి ఉన్నది. అయినప్పటికీ, JSW మోటార్స్ ఒక ప్రత్యేక సంస్థగా పని చేస్తుంది. ఈ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లతో సహా సరికొత్త వాహనాలపై అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నిస్తోంది.

డీలర్ షిప్ కోసం కీలక ప్రకటన

Advertisement

JSW మోటార్స్‌ దేశ వ్యాప్తంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలలో భాగంగా, కంపెనీ ఇటీవల డీలర్ భాగస్వాములను కోరుతూ పూర్తి పేజీ న్యూస్ పేపర్ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో SUV టీజర్ ఫోటో కూడా ఉంది. ఇది దేశీ మార్కెట్ లోకి JSW మోటార్స్ నుంచి లాంచ్ కాబోయే తొలి SUVగా ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్‌ కొత్త ప్లాంట్ లో ఉత్పత్తి

JSW మోటార్స్ తన వాహనాలను మహారాష్ట్ర  ఛత్రపతి సంభాజీ నగర్‌లోని కొత్త ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు ధృవీకరించింది. ప్లాంట్ లో వాహనాల తయారీ పనులు దశల వారీగా కొనసాగున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ తన మొదటి మోడల్‌ ను 2026 ఎండింగ్ వరకు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

JSW మోటార్స్‌ ఫస్ట్ మోడల్ గురించి..

Advertisement

JSW మోటార్స్‌ నుంచి రాబోయే SUV మిడ్ సైజ్ విభాగంలో ఉంటుందని భావిస్తున్నారు. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ లేదంటే పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్‌ తో అందించబడుతుందని భావిస్తున్నారు. ఇండియన్ ఆటో ఇండస్ట్రీ అంచనాల ప్రకారం ఈ మోడల్‌ ను స్థానికంగా అసెంబుల్ చేసి, వెర్షన్‌ ను బట్టి రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ధర ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ చౌకైన వేరియంట్ వచ్చేసింది, దీని ధర ఎంతో తెలుసా?

కీలక ఆటో సంస్థల నుంచి గట్టిపోటీ!

JSW మోటార్స్‌ కంపెనీ అన్నీ అనుకున్నట్లు ముందుకు సాగితే, JSW మోటార్స్ భారతీయ యాజమాన్యంలోని అతికొద్ది ప్యాసింజర్ వాహన తయారీదారులలో ఒకటిగా మారవచ్చు ఆటో నిపుణులు భావిస్తున్నారు. అయితే, పోటీ ఇండస్ట్రీలో ఈ కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సరికొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకురావాలంటున్నారు.

Read Also: బ్లాక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×