E-Paper
Advertisement

Nani Aaya Sher: యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న “ఆయా షేర్” సాంగ్.. 24 గంటల్లోనే!

Nani Aaya Sher: యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న “ఆయా షేర్” సాంగ్.. 24 గంటల్లోనే!
Advertisement

Nani Aaya Sher: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి.. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టారు నాని. ఆ తర్వాత రేడియో జాకీగా పనిచేసి..హీరోగా ‘అష్టా చమ్మా’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఎదుగుతూ అటు మాస్ హీరోగా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటూ నేడు నేచురల్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు. ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా బిజీగా మారిన ఈయన తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మార్చిలోనే ఈ సినిమా విడుదలకు రావాల్సి ఉండగా.. సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా ఇప్పుడు ఆగస్టు 21కి ఈ సినిమాను వాయిదా వేశారు.

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఆయా షేర్..

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి నాని పుట్టినరోజు సందర్భంగా “ఆయా షేర్” అంటూ ఒక పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా ఇందులో నాని మాస్ స్టైల్ లో వేసిన స్టెప్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. అదిరిపోయే లిరిక్స్, అనిరుద్ బీట్, నాని మాస్ స్టెప్పులకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ పాటకు 24 గంటల్లోనే 22 మిలియన్ల వ్యూస్, 700K లైక్స్ తో ఈ పాట రికార్డ్ సృష్టిస్తోంది. ఇక ఈ పాట రాకతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆయా షేర్ వారం ముగిసేలోపు ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

also read:Amalapaul: నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైంది.. అమలాపాల్ కామెంట్స్!

రికార్డ్ సృష్టిస్తున్న వేళ కాపీ ఆరోపణలు

ఇదిలా ఉండగా మరొకవైపు నాని హుక్ స్టెప్ తో సోషల్ మీడియాలో షేక్ చేస్తుంటే.. ఈ స్టెప్ తనదే అంటూ ఒక యూట్యూబర్ సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ , యూట్యూబర్ , డాన్సర్ బాబా జాక్సన్ గత కొన్ని రోజులుగా తన డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ అందుకున్న విషయం తెలిసిందే. పైగా ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న బాబా జాక్సన్ గతంలో ఒక విదేశీయుడుతో కలిసి తాను చేసిన హుక్ స్టెప్ ను నాని తన సినిమాలో వాడుకున్నాడు అంటూ కాపీ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు తాను వేసిన ఒరిజినల్ డాన్స్ తో పాటు నాని ఆయా షేర్ పాటను కూడా షేర్ చేశాడు. ” ఇది ఒరిజినల్.. ఇది కాపీ ” అంటూ రెండు వీడియోలను పోల్చి చూపించారు. డాన్సర్ చేసిన ఆరోపణలపై నెటిజన్ల నుండి మిక్స్డ్ స్పందన లభిస్తుంది. ఇందులో స్టెప్స్ సేమ్ గా ఉన్నాయని అభిప్రాయపడుతుంటే.. మరి కొంతమంది డాన్స్ లో ఇలాంటి లెగ్ మూమెంట్స్ సాధారణమే.. దీనిని కాపీగా పరిగణించడం సరైనది కాదు అంటూ తిప్పి కొడుతున్నారు.

Advertisement

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×