E-Paper
Advertisement

మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్.. ‘దళపతి విజయ్’ టాపిక్ పై సంచలన పోస్ట్!

మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్.. ‘దళపతి విజయ్’ టాపిక్ పై సంచలన పోస్ట్!
Advertisement

Malavika Mohanan: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో మీడియా హద్దులు దాటడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. తాజాగా ఇటువంటి చేదు అనుభవమే ఎదురవడంతో ప్రముఖ స్టార్ బ్యూటీ మాళవికా మోహనన్ తెగ ఫైర్ అయిపొయింది.. కేవలం వ్యూస్, క్లిక్ బైట్స్ మరియు చీప్ పాపులారిటీ కోసమే కొందరు రిపోర్టర్లు ఇలాంటి అసభ్యకరమైన, అనవసరమైన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేసిన పోస్ట్ ప్రస్తుతం సౌత్ సినీ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో  

Advertisement

సహజంగానే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండే మాళవిక తమిళనాడు మీడియా మరియు అక్కడి జర్నలిస్టుల పట్ల ఎంతో గౌరవం తో ఉంటుంది . కానీ నిన్నటి ఈవెంట్‌లో ఒకరిద్దరు రిపోర్టర్లు ప్రవర్తించిన తీరు, అడిగిన ప్రశ్నలు ఆమెను తీవ్రంగా బాధించాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని టార్గెట్ చేస్తూ అడిగిన ప్రశ్నలపై ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. విజయ్‌తో తనకు గత ఏడేళ్లుగా ఎంతో అద్భుతమైన పరిచయం ఉందని, ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని మాళవిక స్పష్టం చేశారు.

also read :పావలా శ్యామల కోసం రంగంలోకి దిల్ రాజు .. అసలు ఏం జరిగిందంటే?

Advertisement

విజయ్‌ని తన బెస్ట్ ఫ్రెండ్ గా భావించడానికి తాను ఎప్పుడూ గర్వపడతానని, ఒక సాటి నటుడిగా, వ్యక్తిగా ఆయన సాధించిన అద్భుతమైన ఎదుగుదలను, ఆయన పొలిటికల్ అండ్ సినిమా జర్నీని పక్కనుండి చూడటం ఒక గొప్ప అనుభూతి అని మెచ్చుకుంది. భవిష్యత్తులో జరిగే ప్రెస్ మీట్‌లలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గౌరవిస్తూ, మర్యాదపూర్వకంగా ప్రశ్నలు అడగాలని, అది అందరికీ మంచిదని ఆమె తేల్చి చెప్పింది.

‘మాస్టర్’లో  హీరోయిన్ గా మాళవిక

నిజానికి మాళవికా మోహనన్ మరియు దళపతి విజయ్ కాంబినేషన్ కు కోలీవుడ్ లో సాలిడ్  ఫ్యాన్ బేస్ ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మాస్టర్’లో మాళవిక హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయం నుంచే విజయ్ తో ఆమెకు మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ ఏడాది కూడా ఆమె విక్రమ్ సరసన నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’ (ఆగస్టు 2024) సినిమాతో నటిగా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ కామెడీ ‘రాజా సాబ్’ సినిమాలో తలుక్కుమన్న సంగతి తెల్సిందే.

also read :సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. రంగంలోకి కమల్ హాసన్, నడిగర్ సంఘం.. కోలీవుడ్‌లో పండగే!

బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో నటిస్తూ

ఇలా బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో నటిస్తూ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో, ఆమె టాలెంట్ ను పక్కన పెట్టి కేవలం కాంట్రవర్సీల కోసమే కొందరు మీడియా ప్రతినిధులు ఇలాంటి పడికట్టు ప్రశ్నలు వేయడం పట్ల నెటిజన్లు కూడా మాళవికకు సపోర్ట్ చేస్తున్నారు.ఇక సెలబ్రిటీలకైనా ప్రైవసీ ఉంటుందని, వ్యూస్ కోసం దిగజారొద్దంటూ ఇప్పటికే కామెంట్లతో హోరెతిస్తున్నారు సోషల్ మీడియా జనాలు .

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×