IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 80 శాతానికి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 20% మ్యాచ్ లు జరిగితే టోర్నమెంట్ కూడా ఫినిష్ కానుంది. ఇలాంటి క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) గురించి సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. ఐపీఎల్ ప్రారంభం అయిన నుంచి ఇప్పటి వరకు టోవర్నమెంట్ ఆడుతూనే ఉన్నాడు ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు మిచెల్ మార్ష్. డెక్కన్ చార్జెస్ నుంచి మొదలుకొని ఇప్పుడు లక్నో వరకు.. మొత్తం ఆరు జట్లు మారాడు. కానీ ఐపీఎల్ టోర్నమెంట్ కు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఈ క్రమంలోనే డెక్కన్ చార్జర్స్ జట్టుకు మిచెల్ మార్ష్ ప్రాతినిధ్యం వహించిన పాత ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసిన ఐపీఎల్ ఫ్యాన్స్ ఎవరబ్బా ఇతను అంటూ సెర్చ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఆటగాడు. అతని వయసు 34 సంవత్సరాలు. అయితే ఇంత వయసు వచ్చినా కూడా టి20లో అద్భుతంగా రాణిస్తూ దూసుకు వెళ్తున్నాడు. అటు ఆస్ట్రేలియా కెప్టెన్ గా కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అయితే అలాంటి మిచెల్ మార్ష్ 2010 నుంచి ఐపీఎల్ టోర్నమెంట్ ఆడుతున్నాడు మిచెల్ మార్ష్. అంటే 16 సంవత్సరాలుగా ఐపిఎల్ లోనే తిష్ట వేశాడు. తన 19వ ఏటా డెక్కన్ చార్జర్స్ తరఫున 2010 ఐపీఎల్ టోర్నమెంట్ లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పెద్దగా అవకాశాలు రాకపోయినా ఏ మాత్రం లైట్ తీసుకోలేదు. అనంతరం 2011 నుంచి 2013 వరకు పూణే వారియర్స్ ఇండియా తరఫున బరిలోకి దిగాడు. ఇక 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు తరఫున కూడా తన ప్రదర్శన కనబరిచాడు.
ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ కు బ్రేక్ ఇచ్చిన మిచెల్ మార్ష్, 2020లో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. కానీ గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక 2022 నుంచి 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అదరగొట్టాడు. 2025 నుంచి ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు మిచెల్ మార్ష్. ఈ పదహారేళ్ల సుదీర్ఘ ఐపిఎల్ లో 55 మ్యాచ్ లు ఆడాడు మిచెల్ మార్ష్. ఇందులో 1292 పరుగులు చేసిన మార్ష్, 37 వికెట్లు కూడా పడగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ పైన 117 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక మార్ష్ ను 3.40 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.