E-Paper
Advertisement

Malavika Mohanan: నెటిజన్ గూబ గుయ్యిమనిపించిన మాళవిక.. అసలేం జరిగిందంటే..?

Malavika Mohanan: నెటిజన్ గూబ గుయ్యిమనిపించిన మాళవిక.. అసలేం జరిగిందంటే..?
Advertisement

Malavika Mohanan: మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తుంది. తెలుగులో ఈమె రాజాసాబ్ మూవీతో సినిమా చేస్తుంది. ఈ మూవీలో ఈమె ప్రజెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని గత కొద్ది రోజులుగా అందరు వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ రాజా సాబ్ నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుందా? తన గురించి తెలుగు ఆడియెన్స్ ఎలా స్పందిస్తారా? అని మాళవిక తెగ ఎదురుచూశారు.. రీసెంట్ గా రిలీజ్ టీజర్ లో అయిన మాళవిక మోహనన్ అందాలకు పెర్ఫార్మన్స్ కు ఫుల్ మార్కులు పడ్డాయి.. వీరద్దరి కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుందని టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ క్రమంలో ఈమె అభిమానులతో చిట్ చాట్ చేసింది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది..

నెటిజన్ కు హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

రాజా సాబ్ టీజర్ లో ఈమె నటన బాగుండటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆమె పై ప్రశంసలు కురిపించారు. దాంతో నెట్టింట్లో తన ఫాలోవర్లు, ఫ్యాన్స్, నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నింటికి చాలా ఓపికగ్గా సమాధానం చెబుతూ వచ్చారు. ప్రస్తుతం తన చేతిలో తెలుగు వరకు రాజా సాబ్ ఉందని, తమిళంలో సర్దార్ 2 ఉందని, మలయాళంలో హృదయపూర్వం సినిమా ఉందని చెప్పారు.. ఈ క్రమంలో ఓ నెటిజన్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేశారు. నన్ను పెళ్లి చేసుకుంటావా బేబ్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దానికి ఆమె నాకు గోస్ట్ లు అంటే భయం.. అందుకే నేను వాటిని పెళ్లి చేసుకోను అని సమాధానం చెప్పింది. దాంతో అందరు బాగా సమాధానం చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ఒక్క సీన్ తోనే బ్లాక్ బాస్టర్ కొట్టిన సినిమాలు ఇవే..?

Advertisement

తన సీక్రెట్ ను బయటపెట్టిన మాళవిక.. 

రాజా సాబ్ షూటింగ్ సెట్ లో జరిగిన ప్రమాదం గురించి బయటపెట్టమని అడిగింది. షూటింగ్ కోసం వచ్చిన మొదటి రోజు షూట్ చేసి అలసిపోయి వచ్చారట.. అలా సెట్‌లోకి పాలిపోయిన మొహం, డల్ ఫేస్‌తో సెట్‌లోకి వచ్చారట.. కానీ ప్రభాస్ మాత్రం ఎంతో చార్మింగ్, అందంగా వెల్కమ్ చెప్పారని సమాధానం చెప్పింది. అయితే మరో నెటిజన్ తన ఏం చూస్తే భయం అనేది చెప్పమని అడిగాడు. బట్టర్ ఫ్లైస్ అంటే నాకు చాలా భయం.. అసలు అలా ఎందుకు భయం ఏర్పడిందో కూడా నాకు తెలీదు.. అసలు ఇలా ఎవరైనా భయపడతారా? అన్నది కూడా తెలీదు అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇకపోతే మాళవిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక సినిమాలు చేతి నిండా ఉండటంతో ఫుల్ బిజీగా ఉంది..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×