Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు స్టోరీతో హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలేమో డైలాగులతో హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు రెండు సీన్లతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాంటి సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. గొప్ప కథ ఉన్నప్పుడు గొప్ప సినిమా తీసిన దర్శకులు ఉన్నారు. భారీ తారాగణంతో గొప్ప సినిమాలు తీసిన వారు కూడా ఉన్నారు. ఇలా కేవలం కొన్ని కథలు మాత్రమే ఉన్నాయి.
చిన్న కథనే స్టోరీ విషయం లో అటుతిప్పి ఇటు తిప్పి కొంత ట్విస్టులు జత చేసి, స్క్రీన్ ప్లే తో మాయ చేసి సినిమా రూపంలో అభిమానుల ముందుకు తీసుకువస్తారు మూవీ మేకర్స్. కొన్ని సినిమాలకి కథ ఎలా ఉన్నా కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒక్క సినిమాతో హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు ఏవో ఒక్కసారి మళ్లీ గుర్తు చేసుకుందాం.. ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..
గబ్బర్ సింగ్..
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ గబ్బర్ సింగ్.. చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో అంత్యాక్షరి సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం ఈ సీన్ కోసమే ప్రేక్షకులు మళ్లీమళ్లీ థియేటర్ కి వెళ్లారంటే అతిశయోక్తి లేదు. ఆ సినిమాకు అదే ప్లస్ అయ్యింది..
సమరసింహారెడ్డి..
గోపాల్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా 1999 జనవరి 13న విడుదలైన సమరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఫ్యాక్షన్ సినిమాల్లో ఇది ఒక్కటి. ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో కేవలం ట్రైన్ సీన్ ఒక్కటే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ట్రైన్ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..
అంజి..
చిరంజీవి నటించిన సినిమాల్లో డిజాస్టర్ అయిన మూవీలల్లో డిజాస్టర్ మూవీ అంజి..కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 2004 జనవరి 15న విడుదలైన అంజి చిత్రం ఫ్లాప్ టాక్ తో చిరు కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో క్లైమాక్స్ సీన్ హైలెట్..
Also Read: వారం కోసం కాదు.. అది ఉంటేనే కమిట్.. తేజు షాకింగ్ కామెంట్స్..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి.. ఆ మూవీలల్లో కొన్ని సీన్లు హిట్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 2009 లో విడుదలైన మగధీర చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. క్లైమాక్స్ పీక్స్.. ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. మరికొన్ని సీన్లు ప్లాప్ అయ్యాయి. ఏది ఏమైనా సీన్లు హైలెట్ అవ్వడంతో సినిమాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.