బాబా వంగా తాను బతికుండగానే భవిష్యత్తులో జరిగే ఎన్నో సంఘటనలను అంచనా వేసి వివరించిందని చెబుతారు. యువరాణి డయానా మరణం దగ్గర నుంచి కరోనా రాక వరకు ఆమె ముందుగానే భవిష్యత్తు అంచనా వేసింది. అవి ఎంతోవరకు నిజమయ్యాయి అన్నది ప్రపంచంలో ఉన్న ప్రజల నమ్మకం. ఈమె బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త అక్టోబర్ 3, 1911న జన్మించింది.
బాబా వంగా చిన్న వయసులోనే చూపును కోల్పోయింది. చూపును కోల్పోయాక ఆమెకు భవిష్యత్తు సంఘటనలను ముందే ఊహించగల దివ్య దృష్టి వచ్చింది. అప్పటినుంచి ఆమె భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పడం ప్రారంభించి అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.
బాబా వంగా 1996లో 86 సంవత్సరాల వయసులో మరణించారు. 96లోనే ఆమె మరణించినా భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే ఆమె చెప్పారు. బాబా వంగా గతంలో చెప్పిన అంచనాలలో ఎన్నో నిజమయ్యాయి. యువరాణి డయానా మరణిస్తుందని, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై దాడి జరుగుతుందని, చైనా అభివృద్ధి చెందుతుందని ముందుగానే ఆమె ఊహించి చెప్పారు. అవన్నీ కూడా చాలా వరకు నిజమయ్యాయి.
2025 సంవత్సరంలో ధనవంతులయ్యే రాశుల గురించి కూడా ఆమె ముందుగానే వివరించారు. ఆ రాశులు ఏవో ఇక్కడ ఇచ్చాము.
మేషరాశి
ఈ సంవత్సరం మేష రాశి వారు ముందుకు సాగుతారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా విశాల హృదయంతో దానిని ఎదుర్కొని ముందుకు వెళతారు. కొత్త శిఖరాలను చేరుకుంటారు. వారి దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి విజయం కలుగుతుంది. కొత్త ప్రయాణాలు మొదలు పెడతారు. వీరు కోరుకున్నట్టు అన్ని విజయాలు దక్కుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారు 2025లో ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. వీరికి ప్రతి మూలా అదృష్టం కలిసి వస్తుంది. రాబడి కూడా పెరుగుతుంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2005లో వృషభ రాశి వారికి స్థిరత్వం దక్కుతుంది.
మిధున రాశి
ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అవకాశాలు అధికంగా ఉంటాయి. తెలివితేటలతో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. సవాళ్లను అధిగమించి ఆర్థిక స్థిరత్వాన్ని, వ్యక్తిగత అభివృద్ధిని సాధిస్తారు. సామాజిక సంబంధాలను పెంచుకుంటారు. మిధున రాశి వారు ఈ సంవత్సరం సరికొత్తగా ఆలోచిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాంప్రదాయ మార్గాలను విడిచిపెట్టి కొత్త మార్గాల్లో నడవాలి.
సింహరాశి
2025లో సింహ రాశి వారి జాతకం ప్రకాశవంతంగా ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో మెరుగుదల వస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటే లాభదాయకంగా పెట్టుబడులు తిరిగి వస్తాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటివి కూడా ఉన్నాయి.
పైన చెప్పిన రాశి చక్రాల వారు 2025 సంవత్సరంలో కచ్చితంగా అదృష్టవంతులు కాబోతున్నారని బాబా వంగా చెబుతున్నారు. అయితే ఏదీ చేయకుండా కూర్చుంటే ఎవరికీ విజయం దక్కదు. కాబట్టి కష్టపడి పని చేస్తూ ఫలితాలను ఆశించాలి.