E-Paper
Advertisement

వెంకటేష్ తో కలసి స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతి!

వెంకటేష్ తో కలసి స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతి!
Advertisement

Venkatesh -Preethi Reddy: విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో నటించిన చిత్రం ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbham). మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. తరచూ వాయిదా పడుతున్న ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు.

నారాయణమ్మ పాటకు స్టెప్పులేసిన ప్రీతి రెడ్డి..

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నేడు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని మల్లారెడ్డి విశ్వవిద్యా పీట్ కాలేజీలో ఈ ట్రైలర్ లాంచ్ (Trailer Launch )కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందంతో పాటు మల్లారెడ్డి కోడలు ప్రీతి(Preethi) ఆమె భర్త భద్ర ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. మల్లారెడ్డి కోడలు ప్రీతి ఎక్కడ ఉంటే అక్కడ హై లెవెల్ ఎనర్జీ ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. ఇక మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ప్రీతి రెడ్డి సినిమా గురించి మాట్లాడటమే కాకుండా అక్టోబర్ 30 వతేదీ ఈ సినిమా కోసం కాలేజీకి హాలిడే ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు.

మల్లారెడ్డి స్టూడెంట్స్ తో వెంకటేష్ డాన్స్..

Advertisement

ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా వెంకటేష్(Venkatesh) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు కాలేజీ లైఫ్ గురించి స్టూడెంట్స్ తో సరదాగా ముచ్చటించారు. మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులతో కలిసి ఈయన వేదికపై నారాయణమ్మ అంటూ సాగిపోయే పాటకు స్టెప్పులు వేశారు. ఈ నేపథ్యంలోని వెంకటేష్ తో కలిసి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి కూడా వేదికపై నారాయణమ్మ పాటకు మాస్ స్టెప్పులు వేసి ఔరా అనిపించారు.

సెలబ్రిటీ రేంజ్ ఫాలోయింగ్..

ప్రీతి రెడ్డి వెంకటేష్ తో కలిసి డాన్స్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ప్రీతి రెడ్డి సెలబ్రిటీ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా వెంకటేష్ తో కలిసి ఈమె స్టెప్పులు వేయడంతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇక ఆదర్శ కుటుంబం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కేవలం కుటుంబ కథ నేపథ్యంలో మాత్రమే కాకుండా ఈ సినిమాలో విభిన్నమైన జోనర్స్ ఉండబోతున్నాయని అందరూ ఊహించిన విధంగా ఈ సినిమా ఉండదని త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పట్ల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: ఆ హీరో నా లక్కీచార్మ్.. సమంత కామెంట్స్ వైరల్!

Related News

రాధేశ్యామ్ లాగా తీస్తే బాగుండదుగా.. ప్రభాస్ పై పంచ్ వేసిన ప్రశాంత్ నీల్!

కళే నా ప్రాణం.. కానీ నన్నే మోసం చేశారు.. గరివిడి లక్ష్మి కన్నీటి కథ!

హే యూ అంటూ హీట్ పెంచేసిన అనుపమ.. లుక్ మామూలుగా లేదుగా!

‘ఎల్లమ్మ’ సినిమాతో యక్షగానానికి మళ్లీ మంచి రోజులు వస్తాయా?

సిసింద్రీలో రమ్యకృష్ణను ఎందుకు తీసేశారు? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

విశ్వక్ సేన్ ఇంత రిస్క్ చేశాడా? ‘కల్ట్’ వెనుక అసలు కథ!

ఆ హీరో నా లక్కీచార్మ్.. సమంత కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×