E-Paper
Advertisement

ఆ హీరో నా లక్కీచార్మ్.. సమంత కామెంట్స్ వైరల్!

ఆ హీరో నా లక్కీచార్మ్.. సమంత కామెంట్స్ వైరల్!
Advertisement

Samantha: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత(Samantha) ప్రస్తుతం సినిమాలకు చిన్న విరామం ప్రకటించారు. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన సమంత బుల్లితెరపై మాత్రం తనదైన శైలిలోనే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. సమంత ప్రస్తుతం సెలబ్రిటీ మాస్టర్ షేప్ తమిళం(Celebriti Master Chef Tamil) షో వ్యాఖ్యాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో సోనీ లీవ్ లో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమోలో భాగంగా ఆర్జే విజయ్ సమంతను ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.

విజయ్ ఆల్ టైం ఫేవరెట్ హీరో..

ఈ సందర్భంగా ఆర్జే విజయ్ సమంతని ప్రశ్నిస్తూ సినీ ఇండస్ట్రీలో ఆల్ టైం ఫేవరెట్ హీరో ఎవరు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమంత ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నటుడు జోసఫ్ విజయ్ (Joseph Vijay)ఆల్ టైం నా ఫేవరెట్ హీరో అని తెలిపారు. అదే విధంగా ఆయన నా లక్కీ చార్మ్ అంటూ సమంత ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సీఎం విజయ్ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ రాజకీయాలలోకి రావడం అనేది మామూలు విషయం కాదు. విజయ్ శ్రమ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని సమంత తెలిపారు.

విజయ్ నా లక్కీ చార్మ్ ..

Advertisement

ఇక విజయ్ నా లక్కీ చార్మ్ అంటూ ఈమె మాట్లాడుతూ.. విజయ్ తో కలిసి తాను మూడు సినిమాలలో నటించానని ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయని సమంత గుర్తు చేసుకున్నారు. సీఎం విజయ్ సమంత కాంబినేషన్లో కత్తి, తేరీ, మెర్సల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కత్తి, తేరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టగా మెర్సల్ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో విజయ్ తన లక్కీ చార్మ్ అంటూ సమంత ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాలలోకి..

ఇక విజయ్ రాజకీయాలలోకి రావడం గురించి కూడా సమంత ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ సక్సెస్ అందుకొని కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. విజయ్ ఆ స్థాయిలో ఉండి తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో వెండితెరకు దూరం అవుతూ రాజకీయాలలోకి రావడం అనేది మామూలు నిర్ణయం కాదని తెలిపారు. కేవలం ప్రజా సంక్షేమం కోసమే ఈయన సినిమాలను పక్కనపెట్టి ప్రజల కోసం కష్టపడటం ఎంతో గర్వించదగ్గ విషయమని సమంత సీఎం విజయ్ పై ప్రశంసలు కురిపించారు.

Advertisement

Also Read: ఇడుపు కాయితం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి?

.

Related News

ఇడుపు కాయితం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి?

ఈమెని వదిలితే ఇన్‌స్టా తగలబడిపోద్ది..నాగదుర్గపై బన్నీ వాస్ సెటైర్లు !

‘గరివిడి లక్ష్మి’ సినిమాని ఇంత మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారా?

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రన్ టైం లాక్.. కీలక సన్నివేశాలు డిలీట్ చేసిన గురూజీ!

ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మారుతి.. వార్నింగ్లు ఇస్తున్న ఫ్యాన్స్

ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

రాజకీయాల వల్ల కోట్లు పోగొట్టుకున్న నటుడు?

Big Stories

Advertisement
×