E-Paper
Advertisement

అడవిలో వేటాడే పులి మనమే.. ఫేక్ సమ్మిట్‌లను అడ్డుకుంటాం: కవిత

అడవిలో వేటాడే పులి మనమే.. ఫేక్ సమ్మిట్‌లను అడ్డుకుంటాం: కవిత
Advertisement

Kavitha: స్వేచ్ఛ బ్యూరో: ‘టీఆర్ఎస్ పార్టీ కొత్తగా వచ్చింది.. కనుక మనం వేరే పార్టీలతో పోల్చుకుంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాలి..అందుకే ప్రజల కోసం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మనం పోరాటం చేద్దాం’ అని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు.హైదరాబాద్ లోని మియాపూర్ లో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు, క్యాడర్ తో రాజధాని రణభేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవిలో తామే పులులమని అందరూ చెప్పుకుంటారు.. వారిని బంధించే వేటగాడు వచ్చాడనే విషయం గుర్తు పెట్టుకోండి.. మానవత్వంతో కూడిన మార్పు హైదరాబాద్ లో రాలేదన్నారు. కనీసం తాగునీళ్లు ఇవ్వలేనోళ్లు విశ్వనగరం అని ప్రచారం చేసుకుంటున్నారని, గ్రేటర్ లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ ఎంవోయూలతో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది.

నేను ఏదో టైమ్ పాస్ కోసం పార్టీ పెట్టలేదు

Advertisement

గతంలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని, లేకుంటే డిసెంబర్ లో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ‘నేను ఏదో టైమ్ పాస్ కోసం మనం పార్టీ పెట్టలేదు. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో పెట్టా’ నన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ మేము జంగిల్ కా షేర్ అని అనుకుంటే…కాంగ్రెస్ బబ్బర్ షేర్ అనుకుంటుంది.. బీజేపీ ఇంకేదో అంటుంది.. కానీ అడవిలో ఎన్ని పులులు ఉన్న సరే.. వేటాడే పులి ఒక్కటే ఉంటుంది.. అది మనమే.. అన్ని పులులను రూమ్ లో పెట్టి బంధించే పరిస్థితి వస్తుందన్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ సహా మూడు కార్పొరేషన్ ల ఎన్నికలు రానున్నాయి.. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటే గుండెకాయలాంటిది.. మన రాష్ట్రానికి కూడా హైదరాబాద్ గుండెకాయ లాంటిదన్నారు.

ఓ పాలసీ అంటూ ఉండాలి కదా ?

Advertisement

అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేస్తామంటే ఒప్పుకోలేదన్నారు. మన రాజధానికి 4 వందల ఏళ్ల చరిత్ర ఉంది.. చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్ ను నిర్మించగలం అన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చిందని, బల్కంపేట్ ఎల్లమ్మ, నాంపల్లి దర్గా, అత్తాపూర్ గురుద్వారా, సెయింట్ జార్జ్ చర్చ్ సాక్షిగా హైదరాబాద్ కు మంచి చేసేందుకు మనం సంకల్పం తీసుకోవాలన్నారు. మన ముఖ్యమంత్రి హైదరాబాద్ లో సముద్రం ఉందని అనుకుంటున్నాడు, కానీ సముద్రం లేని మన నగరాన్ని అప్పట్లోనే నిజాంలు పెర్ల్ సిటీగా మార్చారు.. ఒకప్పుడు పెర్ల్ సిటీగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఐటీ ఉద్యోగుల కృషితో ఐటీ సిటీగా మారిందన్నారు. ఏఐ కారణంగా వాళ్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని, మరి ఐటీ ఉద్యోగుల కోసం ఓ పాలసీ అంటూ ఉండాలి కదా ? కానీ మన దేశంలోనూ రాష్ట్రంలోనూ వాళ్ల కోసం ఒక పాలసీ అంటూ లేదన్నారు. ఐటీ ఉద్యోగులకు మేలు చేసేందుకు మా పార్టీ కచ్చితంగా పోరాటం చేస్తుందన్నారు.

ప్రతి సమస్య విషయంలో ప్రశ్నిస్తాం..

ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని పెట్టి ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని, కానీ అవన్నీ ఫేక్ సమ్మిట్లు, ఫేక్ పెట్టుబడులు అని దుయ్యబట్టారు. మీ ఫేక్ పెట్టుబడులు, మీ ఫేక్ కంపెనీలు మాకు వద్దన్నారు. విశ్వనగరం అని చెప్పే మన హైదరాబాద్ లో కనీసం తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. మంచి నీళ్లు కూడా ఇవ్వలేని వాళ్లు విశ్వనగరం, న్యూయార్క్, లండన్ చేస్తారా? అని నిలదీశారు. చెత్తను ప్రాసెస్ చేయటానికి సంబంధించి రామ్ కీ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని, దీంతో 50వేల మంది కార్మికులు జీవనం కోల్పోతున్నారని ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో 300 సీట్లలో పోటీ చేస్తున్నామని, జీహెచ్ఎంసీ సీట్లు గెలుస్తున్నామన్నారు. ప్రతి సమస్య విషయంలో ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కారం కూడా చెబుతామని, అందుకే మాతో పెట్టుకోవద్దనికాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వారికి మేము మంచి చేస్తాం..

జీహెచ్ఎంసీ కి రూ. 11 వేల కోట్ల బడ్జెట్ ఉందని, కానీ సిటీ అన్ని రోడ్లు గుంతలే ఉన్నాయని మండిపడ్డారు. ఒకప్పుడు హైదరాబాద్ లో థర్మల్ స్టేషన్, ఎయిర్ పోర్ట్ ఉండేది..కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. నగరంలో అన్ని కనీస సౌకర్యాలు లేకుండా చేశారని ఆరోపించారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లేలా చేస్తూ కార్పొరేట్ స్కూళ్ల దందాను రాజకీయ నాయకులు చేస్తున్నారని, ఈ విషయాలన్నింటినీ మనం ప్రజలకు చెప్పాలని పిలుపు నిచ్చారు.ఎ మ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్ల అవుదామనుకునే వాళ్లు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. క్రమశిక్షణతో పనిచేయాలని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. యూత్, మహిళలు కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిచ్చారు. ముస్లింలను అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాడుకోని మోసం చేశాయన్నారు. వారికి మేము మంచి చేస్తాం. అందుకే మా పార్టీలోకి రావాలని వారిని ఆహ్వానించారు. పాతబస్తీలో ఉండే రాజకీయ నాయకులుకాంగ్రెస్ ప్రభుత్వానికి గులామ్ కాకుండా ప్రజలకు గులామ్ లు గా ఉండండి అని సూచించారు.పాతబస్తీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చండి అని హితవు పలికారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీకాంత్ గౌడ్ కు మనమంతా అండగా ఉండాలని, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా మనం సమాయాత్తం కావాలని సూచించారు.

Also Read: టీడీపీని కలవరపెడుతోన్న ఆ సెంటిమెంట్.. విశాఖ మేయర్ మళ్లీ పీఠం కలేనా?

Tags

Related News

2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం!- సీఎం రేవంత్

దక్షిణాది రాష్ట్రాల భద్రతకు బిగ్ ప్లాన్.. ఉమ్మడి సెక్రటేరియట్‌కు రేవంత్ పిలుపు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్! భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

హరీష్‌ రావును నమ్మితే మన్నుతో అంబలి తాగినట్టే!- సీఎం రేవంత్

కుళ్లిన అల్లం, ఫంగస్‌ వెల్లుల్లితో ఏ1 పేస్ట్.. మేడ్చల్‌లో అధికారుల గుట్టు రట్టు!

తెలంగాణ బార్ కౌన్సిల్‌కు బిగ్ షాక్.. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై BCI స్టే!

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై ఈటల రాజేందర్‌ సంచలన నిర్ణయం.. ఈ నెల 27 నుంచి పాదయాత్ర!

Big Stories

Advertisement
×