E-Paper
Advertisement

సినిమా చూడటానికి కాలేజీకి సెలవా.. ఇదేం కొత్త రూల్ మల్లన్నా!

సినిమా చూడటానికి కాలేజీకి సెలవా.. ఇదేం కొత్త రూల్ మల్లన్నా!
Advertisement

Mallareddy Institutions:మల్లారెడ్డి విద్యాసంస్థల్లో వరుసగా జరుగుతున్న సినిమా ఈవెంట్లు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. కాలేజీల్లో చదువులు చెప్పడం మానేసి, ఇలా సినిమా ప్రమోషన్లు చేయడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.విషయంలోకి వస్తే విక్టరీ వెంకటేశ్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మల్లారెడ్డి విద్యాసంస్థల్లో జరిగిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమా గనుక చూస్తామంటే కాలేజీకి హాలీడే ఇస్తామని ప్రీతి రెడ్డి చెప్పడమే ఈ కాంట్రవర్సీకి కారణమైంది.

నిజానికి సినిమా అంటే అందరికీ ఇష్టమే. ఇక తమ ఫేవరేట్ హీరో సినిమా రిలీజ్ అయితే మొదటి రోజే చూడాలని చాలామంది అనుకోవడం కూడా కామన్.ఇక హీరోలు కూడా తమ సినిమాలను ఆడియన్స్ లోకి తీసుకెళ్లేందుకు కాలేజీల్లో ఈవెంట్లు ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.కాలేజీలలో ఇలాంటి ఈవెంట్స్ ఏర్పాటు చేసినప్పుడు వారి స్టడీస్ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాలేజీ నడిపే వారిపై ఉంటుందన్నది కాదన లేని సత్యం.అలాంటిది ఇపుడు ఈవెంట్స్ నిర్వహించడమే కాకుండా సినిమా పబ్లిసిటీ కోసం ఏకంగా సినిమా రిలీజ్ రోజు హాలీడే ఇవ్వడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

Advertisement

ముఖ్యంగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కోసం ఏకంగా కాలేజీకి హాలీడే ఇవ్వడం పట్ల నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినా తల్లి దండ్రులు కష్టపడి పిల్లలని స్కూల్ కి పంపించేది చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించాలనే ఆశతోనే తప్ప, సినిమా ఈవెంట్లలో పాల్గొనడానికి కాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంతా కాదు. కొందరు తమకొచ్చే సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఫీజులకే ఖర్చు పెడుతుంటారు కూడా.ఇక మరికొందరు అప్పులు చేసి పిల్లలను మంచి కాలేజీల్లో చదివిస్తుంటారు. అలాంటప్పుడు విద్యాసంస్థలు కూడా విద్యార్థులకి బాగా చదువుకోవాలని చెప్పాలని,అంతే కాని ఇలా కాలేజీలలో ఈవెంట్స్ పెట్టేసి రిలీజ్ రోజు హాలీడేలు ఇవ్వడం ఏంటని నెట్టింట్లో మండిపడుతున్నారు.

Advertisement

ఇక ఈ మధ్యే టాక్సిక్ సినిమా ఈవెంట్ లోనూ సౌండ్ బాక్సులు కూలి స్టూడెంట్స్ గాయపడటం మనం మర్చిపోలేదు కూదా.అప్పుడే మళ్ళీ కాలేజీలలో ఈవెంట్స్ నిర్వహించడం ఏంటని ,అసలు ఆ టాక్సిక్ ఈవెంట్ నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు అంటూ మండిపడుతున్నారు.

అయితే ఇదే విషయమై మరి కొందరు మాట్లాడుతూ సినిమా ఈవెంట్లు నిర్వహించడం తప్పని చెప్పలేం కానీ కానీ వాటి వల్ల జరగాల్సిన క్లాసులు ఏమైనా ఇబ్బందికి గురవుతున్నాయా ?ఈవెంట్స్ చేసేందుకు సరైన పర్మిషన్స్ తీసుకుంటున్నారా అంటూ ,తీసుకుంటే అక్కడ స్టూడెంట్స్ కోసం ఎలాంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు వంటి విషయాలపై ఫోకస్ పెట్టాలని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

ఏది ఏమైనా చదువుకోవాల్సిన స్టూడెంట్స్ ని ఇలా సినిమాల పేరుతో ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ ఫ్యూచర్ తో ఆడుకోవద్దన్నది ఎక్కువ మంది నుండి వినిపించే మాట. చూడాలి మరి ఈ విషయం పై మల్లారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో !

ALSO READ :అవంతిక మిశ్రా అందాల జాతర.. ఆ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Tags

Related News

మోహన్ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

అణిచివేయాలని చూస్తే సహించేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!

అవంతిక మిశ్రా అందాల జాతర.. ఆ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్న మెగా డాటర్ నిహారిక!

40 ఏళ్ల సినీ కెరియర్ లో ఫస్ట్ టైం ఆ పని చేసిన రజినీకాంత్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

తెలంగాణ పెళ్లిళ్లంటే మందు సీసాలేనా? ‘గడప’ పాటపై రచ్చ!

గాడ్ ఆఫ్ వార్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కూడా ఓకే చేశారా?

Big Stories

Advertisement
×