Avantika Mishra:అవంతిక మిశ్రా…సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇపుడు సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులని ఫిదా చేస్తుంది.అందులో భాగంగా గ్లామరస్ అండ్ కొత్త పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది .ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఒక పిక్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
ఫోటోలో లైట్ బ్లూ కలర్ డ్రెస్‌లో అవంతిక కలర్ఫుల్గా కనిపిస్తోంది. జుట్టులో తెల్లటి పువ్వు పెట్టుకుని కూల్ వెదర్ లో ఈ భామ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి “A walk in the park kind of love” అంటూ క్యాప్షన్ పెట్టడం విశేషం.
సాధారణంగా ప్రేమ అనగానే పెద్ద పెద్ద బహుమతులు, ఖరీదైన గిఫ్టులు, గ్రాండ్ సెలబ్రేషన్లు అనుకుంటారు. కానీ ప్రేమంటే మనసుకు నచ్చిన వ్యక్తితో కాసేపు ప్రశాంతంగా గడపడం, పార్కులో నడుస్తూ మనసు విప్పి మాట్లాడుకోవడం, చిన్న చిన్న విషయాల్లోనే గొప్ప ఆనందాన్ని వెతుక్కోవడం అని ఇండైరెక్ట్ గా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.అవంతిక రాసిన ఈ లైన్స్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, అందరి హృదయాలను తాకేలా ఉన్నాయి. అయితే ఈ పోస్ట్ ద్వారా ఆమె తన పర్సనల్ లవ్ లైఫ్ గురించి ఏమైనా హింట్ ఇచ్చిందా ఏంటీ ఆరాలు తీస్తున్నారు అవంతిక ఫ్యాన్స్.
ఇక అవంతిక మూవీ కెరీర్ విషయానికి వస్తే.. 2014లో దర్శకుడు నీలకంఠ తెరకెక్కించిన ‘మాయ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ .సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో మేఘన పాత్రలో నటించి తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
ఆ తర్వాత 2016లో వచ్చిన ‘మీకు మీరే మాకు మేమే’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్లో ప్రియగా నటించి మెప్పించింది. 2017లో లేడీ డైరెక్టర్ జయ బి దర్శకత్వంలో వచ్చిన ‘వైశాఖం’ సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైపోయింది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ నిర్మాణంలో, తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలోనూ చిన్న పాత్రలో మెరిసిన ఈ బ్యూటీ నితిన్-రష్మిక మందన్న జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘భీష్మ’లోని హిట్ సాంగ్ ‘సింగిల్స్ ఆంథమ్’లో స్పెషల్ గా కనిపించి అలరించింది కూడా. మొత్తంగా అటు కేవలం సినిమాలే అని గిరి గీసుకుని కూచోకుండా ఇలా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది.
ఇక తెలుగుతో పాటు కోలీవుడ్ లోనూ అవంతిక తన లక్ టెస్ట్ చేసుకుంది. ‘ఎన్న సొల్ల పోగిరాయ్’, ‘డి బ్లాక్’, ‘ఎమక్కు తొళిల్ రొమాన్స్’ వంటి తమిళ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
మొత్తంగా ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియా ద్వారా పర్సనల్ లైఫ్, లేటెస్ట్ ఫొటోషూట్ విశేషాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది అవంతిక !
ALSO READ :ట్రెయిటర్స్‌లో ఆట పక్కన పెట్టి పర్సనల్ అటాక్‌లు.. ఇదేం గొడవరా బాబూ!