Horror Mystery Thriller: ఓ ఫ్యామిలీలో కొన్ని సీక్రెట్స్ తరాల పాటు సస్పెన్స్ గానే ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల క్రితం ఎలాంటి క్లూ లేకుండా కనిపించకుండా పోయారో, వాళ్ళ డెడ్ బాడీ సడెన్ గా దొరికితే ఆ ఫ్యామిలీకి ఎంత షాకింగ్ గా ఉంటుంది ? సరిగ్గా ఇలాంటి పాయింట్ తోనే ఆడియన్స్‌ను కంప్లీట్ గా భయపెట్టేందుకు వస్తున్న మైండ్ బ్లోయింగ్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ది సైకిల్’ (The Cycle). 36 ఇయర్స్ బ్యాక్ మాయమైన తండ్రి శవం ఒక భయంకరమైన క్రైమ్ స్పాట్ లో ప్రత్యక్షమవ్వడంతో ఈ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. మరి ఈ భయంకరమైన సినిమాను ఓటీటీ మూవీ లవర్స్ ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
పోలీసులకు ఒక ఎంప్టీ ప్లేస్ లో ఒక పాత డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు షాకింగ్ నిజం బయటపడుతుంది. ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, సరిగ్గా 36 సంవత్సరాల క్రితం మిస్సైన ఒక వ్యక్తిది. ఇన్ని దశాబ్దాలుగా అతను ఎక్కడ ఉన్నాడు ? అసలు అతన్ని ఎవరు చంపారు ? ఆ పాత క్రైమ్ కు కరెంట్ సిట్యుయేషన్ కు ఏంటి సంబంధం అనే మిస్టరీని సాల్వ్ చేయడానికి పోలీస్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఈ కేసులో మెయిన్ విక్టిమ్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ ఆ డెడ్ బాడీ కూతురు.
తండ్రి చిన్నప్పుడే మిస్సవ్వడంతో ఆమె తన లైఫ్ ను వేరేలా లీడ్ చేస్తుంటుంది. కానీ ఇప్పుడు సడెన్ గా తండ్రి డెడ్ బాడీ దొరకడంతో, అతని గతాన్ని తవ్వాల్సి వస్తుంది. తండ్రి గురించిన నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న కొద్దీ ఆమెకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. తను ఇంతకాలం నమ్మిన నాన్న వేరు, అసలు నిజాలు వేరు అని తెలుసుకుని షాక్ అవుతుంది. మరి ఇంతకీ తన తండ్రి గురించి బయట పడిన ఆ నిజాలు ఏంటి ? ఎప్పుడో కనిపించకుండా పోయిన అతని శవం ఇప్పుడు ఎలా ప్రత్యక్షమైంది ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా, ఈ కథలో పవర్ ఫుల్ హర్రర్ అండ్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి.
‘ది సైకిల్’ హర్రర్ థ్రిల్లర్ షడ్డర్ (Shudder) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒరిజినల్ కాబట్టి, ఇండియన్ ఓటీటీ యూజర్లకు తెలుగు డబ్బింగ్ లేదా సబ్‌టైటిల్స్ అవైలబుల్ గా లేవు. చీకటి రాత్రులు, భయంకరమైన జ్ఞాపకాలు, ఆ కూతురును వెంటాడే ఆత్మలు సినిమాలో నెక్స్ట్ లెవెల్ హర్రర్ అనుభూతిని ఇస్తాయి. జోర్డన్ డౌనీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో డెబోరా ఆన్ వోల్, జెఫ్రీ డోనోవన్, విల్ హోచ్మన్ తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు.
Read Also: పోలీసులు జైల్లోనే కొట్టి చంపేస్తే… సీజన్ 2తో వచ్చేసిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్