Bigg Boss 9 Telugu Promo: బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంది. కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే ఈ సీజన్ కు శుభం కార్డు పడిపోతుంది. ఈ క్రమంలో ఈ వారం ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. కంటెస్టెంట్లు టాప్ ఫైవ్ లో ఉండేందుకు గట్టి పోటీని ఇస్తున్నారు.. నువ్వా నేనా అంటూ బిగ్ బాస్ ఇస్తున్న ప్రతి టాస్క్ ని పోటీ పడి పూర్తి చేస్తున్నారు.. 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 14 వ వారంలోకి అడుగు పెట్టింది.. ఈవారం జనాలకు మరింత ఉత్కంఠ నెలకొల్పేందుకు బిగ్ బాస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటివరకు ఫైనలిస్ట్ లో ఉండేందుకు పోటీ పడ్డారు హౌస్ మెట్స్.. ఈ వారం లీడర్ బోర్డులో స్కోర్ కోసం యుద్ధం చేస్తున్నారు. తాజాగా ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
ఇవాళ్టి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేసింది. ఆ ప్రోమోలో లీడర్ బోర్డులో స్కోర్ చేసేందుకు వీల్ బారో టాస్క్ ని బిగ్ బాస్ ఇస్తాడు.. ఆ టాస్క్ లో తమ పార్ట్ ని పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ ఎవరైతే ముందుగా గమ్యాన్ని చేరుకుంటారో వాళ్ళు లీడర్ బోర్డ్ లో స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది అని బిగ్ బాస్ చెబుతాడు.. ఈ పోటీలో హౌస్ లోని ప్రతి ఒక్క కంటెస్టెంట్ నిలబడతారు.. మొత్తానికి ఆ టాస్క్ అయితే పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరూ కలిసి ఒకరిని ఎంపిక చేయాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు.. వాళ్లు తర్వాత వచ్చే టాస్కులలో పర్ఫామెన్స్ చేయలేరు అని అంటారు.. అయితే ఇంటి సభ్యులు అందరూ కలిసి ఒకరిని సెలెక్ట్ చేసుకునే పనిలో ఉంటారు..
ఇమాన్యుల్ సంజనకు నువ్వు పోటీలో ఉండు నేను ఉండకపోయినా పర్వాలేదు అని అంటాడు.. ఆ తర్వాత ఎవరు ఉండకూడదు అన్నది చర్చించుకుంటారు.. సంజన నన్ను ఫోర్స్ చేస్తుంది నువ్వు ఇమాన్యుయేల్ పేరు చెప్పు అని అంటుంది. ఆ మాట వినగానే ఇమ్మానుయేల్ షాక్ అవుతాడు. ఆ తర్వాత సంజన దీనిపై చర్చ జరిపి పెద్ద రచ్చ చేస్తుంది.. మొత్తానికి సంజన, తనూజాలు గొడవ ఎపిసోడ్కి హైలెట్ గా నిలవనుంది.
Also Read : నరసింహ పార్ట్ 2 వచ్చేస్తుంది.. ఇట్స్ రివెంజ్ టైం…
ఇమ్మానుయేల్ సంజన, తనూజ ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు. క్రమంలో సంజన భరణి దగ్గరకు వెళ్లి ఈ పోటీలో భరణిని తీసేయాలి అని అంటున్నట్లు చెబుతుంది.. ఆ మాట వినగానే ఇమాన్యుయల్ నేను భరణి అన్నని తీసేయమని చెప్పానా అని అరుస్తాడు.. నువ్వు అనలేదా భరణిని తీసి ఆలోచనలో ఉన్నారు అని సంజన అంటుంది. ఆ మాట వినగానే భరణి ఆవేశంతో ఊగిపోతాడు.. ఇమ్యానుయేల్ ను కొట్టేలా స్పీడుగా వస్తాడు. అతని ఆవేశం చూసిన ఇమ్ము భయపడిపోయి అన్న నేను మీ గురించి చెప్పలేదు అన్న అని క్లారిటీ ఇస్తాడు. ఏది ఏమైనా సరే వీరిద్దరి చర్చ గొడవగా మారే అవకాశం ఉన్నట్లు ప్రోమో అని చూస్తే తెలుస్తుంది. మొత్తానికి ఇవాళ ప్రోమో గొడవలతో ముగిసింది.. ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మిస్ అవ్వకుండా చూడాల్సిందే..