Car Accident: తిరుపతిలోని పరిసర ప్రాంతంలో రెండు కార్లు ఢీకొని.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు పోటు కార్మికులుగా గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. నగరి నుండి తిరుపతివైపు వెళ్లుతున్న కారు.. అతివేగంగా ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోపల ఉన్నవాళ్లలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
మృతుల వివరాలు చూస్తే.. శంకర, సంతానం వీరిద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోటు కార్మికులుగా పనిచేస్తున్నారు. మరొక వ్యక్తి తమిళనాడు వాసి.
ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు తమిళనాడు వాసులుగా గుర్తించారు. వీరు తిరుపతిలో పనులు ముగించుకుని తిరిగి తమ గ్రామాలకు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: డ్రైవర్ డ్రంకెన్ డ్రైవింగ్.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్‌లో
డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.