E-Paper
Advertisement

Manasa Varanasi: పెళ్లికి ముందు అలా చేయడం తప్పేం కాదు.. మానస వారణాసి బోల్డ్ కామెంట్స్

Manasa Varanasi: పెళ్లికి ముందు అలా చేయడం తప్పేం కాదు.. మానస వారణాసి బోల్డ్ కామెంట్స్
Advertisement

Manasa Varanasi: అందం, అభినయంతో ఒక్క అవకాశం వస్తే చాలు తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమని దర్శకులకు హింట్ ఇస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో మానస వారణాసి(Manasa Varanasi) కూడా ఒకరు. 2024లో ‘దేవకీ నందన వాసుదేవ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి రెబెల్ స్టార్ ప్రభాస్ లాంటి వారు సపోర్ట్ చేయడంతో ఈ సినిమాకి ఊహించని ఇమేజ్ లభించిందని చెప్పవచ్చు.

లివింగ్ రిలేషన్ పై మానస కామెంట్స్..

ఇకపోతే ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మానస వారణాసి ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పెళ్లికి ముందు అలా చేయడం తప్పేం కాదు అని చెప్పి నెట్టింట కొత్త చర్చకు తెరలేపింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో మానస వారణాసి మాట్లాడుతూ లివింగ్ రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది. “ఈ మధ్యకాలంలో యువత కూడా లివింగ్ రిలేషన్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే ఏ బంధంలో నైనా సరే అవగాహన అనేది చాలా ముఖ్యం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే.. లివింగ్ రిలేషన్ చాలా ఉపయోగపడుతుంది.

సర్దుకుపోయే గుణం లేదు..

Advertisement

పాత కాలంలో పెళ్లయ్యాక ఒకరినొకరు అర్థం చేసుకునేవారు కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో చాలా విషయాలలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. లివింగ్ రిలేషన్ వల్ల ముందే ఒకరి స్వభావం , ఆలోచన అర్థం చేసుకునే అవకాశం దక్కుతోంది .అప్పటి వాళ్ళలాగా ఇప్పటివారిలో సర్దుకుపోయే తత్వం లేదు” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది మానస వారణాసి. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రిలేషన్ షిప్ పై ఈమె చేసిన కామెంట్లకు సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. కొంతమంది ఈమెకు మద్దతు పలికితే.. మరి కొంతమంది విమర్శిస్తున్నారు.

ALSO READ:Actress Laya: ఎన్టీఆర్ సినిమా మిస్.. ఎన్నో అవకాశాలు కోల్పోయానంటున్న లయ!

మానస వారణాసి ప్రస్తుత సినిమాలు..

Advertisement

మానస వారణాసి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. మెయిన్ హూ కౌన్ సినిమాతో పాటు శశికుమార్, రావు రమేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈమె అవకాశాన్ని అందుకుంది. ఇక అలాగే కపుల్ ఫ్రెండ్లీ తో మంచి సక్సెస్ అందుకున్న ఈమె.. మళ్లీ ఇదే హీరోతో అదే బ్యానర్లో వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగమ్మాయిగా తనకంటూ ఒక మంచి పేరు దక్కించుకున్న మానస వారణాసి.. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ కెరియర్ ను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక మొత్తానికైతే మానస వారణాసి షేర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×