E-Paper
Advertisement

మంచు ఫ్యామిలిలో పుట్టకపోతే బాగుండు..ఇలా అనేసావేంటీ లక్ష్మక్క ?

మంచు ఫ్యామిలిలో పుట్టకపోతే బాగుండు..ఇలా అనేసావేంటీ లక్ష్మక్క ?
Advertisement

Manchu Lakshmi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబంలో మంచు ఫ్యామిలీ(Manchu Family) ఒకటి. మోహన్ బాబు ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన వారసులుగా లక్ష్మీ ప్రసన్న, విష్ణు ,మనోజ్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు కెరియర్ లో మంచి సక్సెస్ కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. మంచి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన లక్ష్మీ ప్రసన్న కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా కూడా పలు కార్యక్రమాలను రన్ చేస్తూ వచ్చారు.

మంచు ఫ్యామిలీలో పుట్టి సక్సెస్ కాలేదా..

ఇదిలా ఉండగా ఇటీవల మంచు లక్ష్మి హానెస్ట్ టౌన్ హాల్ అనే కార్యక్రమంలో భాగంగా అభిమానులతో కలిసి ముచ్చటించారు .ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని ఈమెను ప్రశ్నిస్తూ.. తన కుటుంబం కెరియర్ గురించి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు మంచు లక్ష్మి చెప్పిన సమాధానం ఇప్పుడు సంచలనంగా మారింది. తాను మంచు కుటుంబంలో పుట్టకపోయి ఉంటే నేను కెరియర్ పరంగా ఇంకా మంచి స్థానంలో ఉండేదాన్ని అంటూ లక్ష్మీ ప్రసన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటినుంచి మా ఇంట్లో అబ్బాయిలదే ఫై చేయి ఉండేది.

ఏదైనా కావాలంటే పోరాటం చేయాలి..

Advertisement

చిన్నప్పటినుంచి నా కోసం ఏదైనా కావాలి అంటే చాలా పోరాటం చేయాల్సి వచ్చేదని మంచు లక్ష్మి తెలిపారు. ఇక తాను కనుక మంచు ఫ్యామిలీలో పుట్టకపోయి ఉంటే ఇండస్ట్రీలో కెరియర్ పరంగా చాలా ఉన్నత స్థాయిలో ఉండేదానినని ఈమె తెలిపారు. ఈ విషయం గురించి మంచు లక్ష్మి ఇదివరకు పలు సందర్భాలలో ప్రస్తావించారు అయితే తాజాగా మరోసారి కూడా మంచి కుటుంబం గురించి మాట్లాడటంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో తన ఇంటి పేరును వాడిన మొట్టమొదటి వ్యక్తిని కూడా తానేనని తెలిపారు.

?igsi=MW8zOGh0MHp2ZnhuZg==

Advertisement

అప్పటివరకు ఇండస్ట్రీలో నాన్న గొప్ప నటుడిగా ఉన్నప్పటికీ అందరూ తనని యం మోహన్ బాబు అని మాత్రమే పిలిచేవారు ఇక తన తమ్ముళ్ళకు కూడా పేరు పక్కన సర్ నేమ్ ఉండేది కాదని తెలిపారు. ఎప్పుడైతే తాను ఇండస్ట్రీలోకి వచ్చానో అప్పుడే నా పేరు పక్కన తన ఇంటి పేరు మంచు అని పెట్టుకున్నా,ఆ తర్వాత తన తమ్ముళ్లు విష్ణు మంచు, మనోజ్ మంచు అని పెట్టుకున్నారు. అలాగే నాన్నను కూడా మంచు మోహన్ బాబు అంటూ పిలవడం మొదలు పెట్టారని తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా మంచు లక్ష్మి ముంబైకి షిఫ్ట్ అవడం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు కేవలం తన కూతురు ఉన్నత విద్య కోసమే తాను ముంబైకి వెళ్లానని తెలిపారు. ఇక ఈమె కూడా సినిమాల విషయానికి వస్తే..ఈ ఏడాది ‘పూకీ’, ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాల ద్వారా మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె ఆహా (Aha) ప్లాట్‌ఫామ్‌లో ‘టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్’ షోకి జడ్జిగా కొనసాగుతున్నారు.

Also Read: చిరంజీవి హిట్ టైటిల్ తో కమిటీ కుర్రోళ్ళు హీరో కొత్త సినిమా!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×