E-Paper
Advertisement

చిరంజీవి హిట్ టైటిల్ తో కమిటీ కుర్రోళ్ళు హీరో కొత్త సినిమా!

చిరంజీవి హిట్ టైటిల్ తో కమిటీ కుర్రోళ్ళు హీరో కొత్త సినిమా!
Advertisement

Sandeep Saroj: కమిటీ కుర్రాళ్ళు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయమైన సందీప్ సరోజ్(Sandeep Saroj) మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యారు. తాజాగా తన రెండో సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. నిహారిక కొణిదెల నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమిటీ కుర్రోలు సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఇటీవల నేషనల్ అవార్డు కూడా వరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నటుడు సందీప్ సరోజ్ వేట సినిమా(Veta Movie)కు కమిట్ అయ్యారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్ జోడిగా సాత్విక (Sathvika) హీరోయిన్ గా నటిస్తున్నారు.

ముఖ్యఅతిథిగా నాగబాబు..

ఈ చిత్రాన్ని ఎస్ ఆర్ డి ప్రొడక్షన్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా కొణిదల నాగబాబుతో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్, సాయి రాజేష్, వీ ఎన్ ఆదిత్య, కేఎస్ రవికుమార్ వంటి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా కే ఎస్ రవికుమార్ క్లాప్ కొట్టారు. ఎస్ కే ఎన్, వీ ఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

మా సినిమాకు మీ సపోర్ట్ కావాలి..

Advertisement

ఈ సినిమా పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. కమిటీ కుర్రోళ్ళు చిత్రంతో అందరికీ తాను పరిచయమయ్యాను ఈరోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నాగబాబు గారికి అలాగే ఇతర దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక మా సినిమాకు వేట అని టైటిల్ చిరంజీవి గారి టైటిల్ మా ఈ కథకు ఈ టైటిల్ బాగుంటుందని, ఈ సినిమాని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా ద్వారా అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ ఇది తన మొదటి సినిమా అని, కథ చెప్పిన వెంటనే కె ఎస్ రవికుమార్ గారు నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారని ఈటీవీ విన్ టీమ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

చిరంజీవి బ్లాక్ బస్టర్ టైటిల్..

Advertisement

ఇక నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ ఈటీవీ విన్ తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ అని తెలిపారు. సందీప్ సాత్విక జంటగా నటించగా కె ఎస్ రవికుమార్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశారు . ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమాకు వేట అనే టైటిల్ పెట్టడంతో చిరంజీవి కెరియర్ లో బ్లాక్ బాస్టర్ సినిమా అని, చిరంజీవి సినిమా టైటిల్ తో రాబోతున్న సందీప్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: భార్యతో విడాకులైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న హీరో.. ఇదేం లాజిక్ గురూ!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×