E-Paper
Advertisement

1వ తేదీనే జీతాలిస్తున్నా బెదిరిస్తారా?.. ఉద్యోగ సంఘాలపై సీఎం హాట్ కామెంట్స్ !

1వ తేదీనే జీతాలిస్తున్నా బెదిరిస్తారా?.. ఉద్యోగ సంఘాలపై  సీఎం హాట్ కామెంట్స్ !
Advertisement

Revanth Reddy: అంబర్‌పేట్-మూసారాంబాగ్ మధ్య మూసీ నదిపై కొత్తగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు.

ఈక్రమంలో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.పదేళ్ల కేసీఆర్ పాలనలో విధ్వంసం అయినా రాష్ట్రాన్ని తాము వికాసం వైపు తీసుకెళ్తున్నామని అయినా కొందరు  ఓర్వలేకనే వెయ్యి రోజుల ప్రజాపాలనపై బురద జల్లేందుకు కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

ఇక తాము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే ఒకటో తారీఖున ఉద్యోగులకు తప్పకుండా జీతాలు ఇస్తుంటే, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పుదోవ పట్టించి తమను బెదిరించేలా మాట్లాడుతున్నారని .అది ఏ మాత్రం సరి కాదని అసహనం వ్యక్తం చేశారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదో తేదీ కల్లా జీతాలు పడుతున్నాయని తెలిపారు . ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును గత ప్రభుత్వం 58 నుంచి 61 ఏళ్లకు పెంచడం వల్ల, 2024 నుంచి రిటైర్ అవుతున్న వేలాది మంది ఉద్యోగుల భారం అంతా ఇప్పుడు తన నెత్తిన పడుతోందని వాపోయారు.

Advertisement

ప్రతి నెలా సుమారు వెయ్యి మంది రిటైర్ అవుతుంటే, ఒక్కో ఉద్యోగికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.

పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయల పాత బకాయిల భారం తమ నెత్తిమీద పెట్టి పోయిందని ,అయినప్పటికీ కేవలం వంద రోజుల్లోనే ఆరు వందల కోట్లను ఉద్యోగ రిటైర్మెంట్ బకాయిల కింద తమ ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు.

పీఆర్సీ బకాయిలు ఎగ్గొట్టింది బీఆర్ఎస్ అయితే, వాటిని తీరుస్తూ ఉద్యోగ సంఘాలను పిలిచి మరీ ఆరోగ్య భద్రతా కార్డులను తిరిగి పునరుద్ధరించింది తామేనని గుర్తుచేశారు.

also read:‘ప్రజాధనం తిన్న పందికొక్కు’.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు!

ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శించని వారు , ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు..మొత్తంగా మూసారాంబాగ్ వంతెన ప్రారంభోత్సవం సందర్బంగా రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలపై చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు తెలంగాణాలో కాక రేపుతున్నాయి .మరి ఈ హాట్ కామెంట్స్ కి ఉద్యోగ సంఘాలు ఎలాంటి రియాక్షన్ ఇస్తాయో చూడాలి !

Tags

Related News

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×