E-Paper
Advertisement

మానవత్వమే పరమార్థంగా మంచు మనోజ్ ముందడుగు.. ‘ఐక్య ధైర్య సేన సమితి’ ప్రారంభం

మానవత్వమే పరమార్థంగా మంచు మనోజ్ ముందడుగు.. ‘ఐక్య ధైర్య సేన సమితి’ ప్రారంభం
Advertisement

Aikya Samithi: జీవిత ప్రయాణంలో ఎదురయ్యే హెచ్చుతగ్గుల కంటే మానవత్వం, తోడుండే మనుషులే ముఖ్యం అని నమ్మే సినీ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి ఒక ఉన్నతమైన ఆశయానికి శ్రీకారం చుట్టారు. తమ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి ముందే సమాజ సేవతో ఈ నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. భూమా మౌనిక ఆలోచనల నుంచి పుట్టిన “AIKYA – Dhairya Sena Samithi” (ఐక్య ధైర్య సేన సమితి) అనే సేవా సంస్థను వారు అధికారికంగా ప్రకటించారు.

Read also-రీల్స్ చేసేవారికి గుడ్ న్యూస్.. మీ దగ్గర ఈ గ్యాడ్జెట్ ఇది ఉంటే పని మరింత సులువు..

Advertisement

ఈ సందర్భంగా మనోజ్-మౌనిక దంపతులు మాట్లాడుతూ, తమకు సేవ అనేది ఈరోజు కొత్తగా మొదలైంది కాదని, అది ఎప్పుడూ తమ జీవితాల్లో ఒక భాగంగానే ఉంటూ వచ్చిందని పేర్కొన్నారు. సహాయం కావాలంటూ వచ్చే ఆర్తుల కోసం తమ ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఇప్పుడు ఆ సేవా స్ఫూర్తికి ఒక పేరును ఇచ్చి, మరింత మందిని ఈ మంచి కార్యం వైపు నడిపించేందుకు ‘ఐక్య’ను స్థాపించినట్లు తెలిపారు. ‘ఐక్య’ అంటే ఐక్యత అని, మానవత్వం కోసం అందరూ ఒకటవ్వడమే దీని ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు.

భగవంతుడు తమకు ప్రసాదించిన దానిని సేవ, విలువలు, మరియు ఒక పవిత్రమైన ఆశయం ద్వారా సమాజంతో పంచుకోవడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఈ సంస్థ ద్వారా ముఖ్యంగా రక్తదానం, అత్యవసర సమయాల్లో వైద్య సాయం, సమాజంలో నిజమైన అవసరాల్లో ఉన్న నిరుపేదలకు తక్షణ మద్దతును అందించనున్నారు. ఎక్కడ సహాయం అవసరమైతే అక్కడ ‘ఐక్య’ ముందుంటుందని వారు భరోసా ఇచ్చారు.

Advertisement

Read also-ఫాస్ట్ కూలింగ్, పర్ఫెక్ట్ స్టోరేజ్.. ఈ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్‌లతో ఇంటికి కొత్త లుక్

ఇది పూర్తిగా నిస్వార్థమైన, రాజకీయ రహిత సంస్థ అని మనోజ్ స్పష్టం చేశారు. “ఇది రాజకీయం కాదు.. ఇది కేవలం మా ఒక్కరిది మాత్రమే కాదు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరిదీ ఈ సంస్థ. గొప్ప ఆశయం కోసం హృదయాలు ఒకటైనప్పుడు, అక్కడ జీవితాలు మారడమే కాదు.. సరికొత్త ఆశలు చిగురిస్తాయి” అంటూ మానవత్వాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరినీ ఈ ప్రయాణంలో కలిసి నడవాల్సిందిగా వారు ఆహ్వానించారు. పుట్టినరోజు వేడుకల కంటే సమాజ సేవకే మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చి, ఆదర్శంగా నిలిచిన ఈ దంపతులపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×