E-Paper
Advertisement

రీల్స్ చేసేవారికి గుడ్ న్యూస్.. మీ దగ్గర ఈ గ్యాడ్జెట్ ఇది ఉంటే పని మరింత సులువు..

రీల్స్ చేసేవారికి గుడ్ న్యూస్.. మీ దగ్గర ఈ గ్యాడ్జెట్ ఇది ఉంటే పని మరింత సులువు..
Advertisement

Mobile Holder: ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. కొందరు నిరంతరం రీల్స్, షార్ట్స్ చూస్తూ గడిపితే.. మరికొందరు కంటెంట్ క్రియేట్ చేస్తూ బిజీగా ఉంటారు. అయితే వీడియోలు చూసేటప్పుడో లేదా రికార్డ్ చేసేటప్పుడో ఫోన్‌ను చేతితో పట్టుకోవడం లేదా దానికి ఒక సపోర్ట్ వెతుక్కోవడం చాలా మందికి పెద్ద టాస్క్. మీకూ ఇలాంటి సమస్యే ఉందా? అయితే మీకోసం అమెజాన్‌లో ఒక అద్భుతమైన, చౌకైన గ్యాడ్జెట్ అందుబాటులో ఉంది. కేవలం రూ.145 లభించే ఈ చిన్న గ్యాడ్జెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-మండుతున్న పెట్రో ధరలు.. ఈ 5 బైక్‌ లు మీ ఖర్చు తగ్గించేస్తాయి!

ఇంతకీ ఏంటా గ్యాడ్జెట్?

Advertisement

దీనిని ‘సిలికాన్ సక్షన్ కప్ మొబైల్ హోల్డర్’ (Silicone Suction Cup Mobile Holder) అని పిలుస్తారు. ఇది చూడటానికి చాలా చిన్నగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. దీని ఒక వైపు మీ ఫోన్‌కు అంటించుకోవడానికి వీలుగా గ్లూ ఉంటే.. మరోవైపు చిన్న చిన్న వ్యాక్యూమ్ కప్స్ (Suction Cups) ఉంటాయి. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. మొదట ఈ హోల్డర్ వెనుక ఉన్న స్టిక్కర్ పొరను తొలగించాలి. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో లేదా ఫోన్ కేస్ పై దీనిని గట్టిగా ప్రెస్ చేసి అంటించాలి. అంతే.. ఇప్పుడు మీ ఫోన్ ఎక్కడైనా అంటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.

Read also-ఐఫోన్ క్రేజ్‌కు బ్రేక్ వేసేలా.. Google Pixel 10పై క్రోమా మైండ్ బ్లోయింగ్ డీల్, ఏకంగా రూ.20,000 ఆదా!

దీని వల్ల ఉపయోగాలు..

Advertisement

కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఆప్షన్.. మీరు రీల్స్, షార్ట్స్ లేదా వ్లాగ్స్ ఎక్కువగా చేస్తుంటే.. ప్రతిసారీ ట్రైపాడ్ మోసుకెళ్లాల్సిన పనిలేదు. నునుపుగా ఉండే ఏ గోడకైనా లేదా అద్దానికైనా ఫోన్‌ను దీని సాయంతో అంటించి ఈజీగా వీడియోలు షూట్ చేసుకోవచ్చు. బాత్రూమ్ మిర్రర్ లేదా డ్రెస్సింగ్ టేబుల్ అద్దానికి ఫోన్ అంటించి, మేకప్ ట్యుటోరియల్స్ చూస్తూ మేకప్ వేసుకోవచ్చు. అలాగే వంటగదిలో టైల్స్ లేదా ఫ్రిజ్‌కు అంటించి కుకింగ్ వీడియోలు చూస్తూ వంట చేయవచ్చు. కారులో ప్రయాణించేటప్పుడు మ్యాప్స్ చూసుకోవడానికి కారు విండ్‌షీల్డ్ లేదా డాష్‌బోర్డ్‌కు దీని ద్వారా ఫోన్‌ను సులభంగా ఫిక్స్ చేయవచ్చు. గాజు కిటికీలు, స్మార్ట్ టీవీ స్క్రీన్లు, నునుపైన టైల్స్, కబోర్డ్స్ ఇలా గాలి చొరబడని ఎలాంటి ఉపరితలం (Smooth Surface) పై అయినా ఇది గట్టి పట్టును ఇస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×