David Reddy: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Rocking Star Manchu Manoj) నటిస్తున్న నూతన చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy). వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్న ఈ చిత్రం, బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్‌గా అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా (Maria Riaboshapka) నటించనుందని అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. మంచు మనోజ్, మరియా ర్యాబోషాప్కా మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయని మూవీ మేకర్స్ ఇప్పటికే చెబుతూ వచ్చారు. తాజాగా ఈ సినిమాలోని ఆమె లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Haritha Harish: భార్య కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్.. తప్పు చేశానంటూ
మరియా ర్యాబోషాప్కా లుక్‌ని గమనిస్తే.. పాతకాలపు విక్టోరియన్, ఎడ్వర్డియన్ స్టైల్ మోడ్రన్ ఫ్యాషన్ కలయికతో ఉన్న వింటేజ్ బ్రిటీష్ ఫ్యాషన్ అవుట్ ఫిట్‌లో మరియా ర్యాబోషాప్కా ఫస్ట్ లుక్‌తోనే అందరినీ ఆకర్షిస్తోంది. టీల్ బ్లూ కలర్‌లో ఉన్న పొడవాటి గౌనులో పాతకాలపు రాయల్ లుక్‌లో మెరిసిపోతోంది. తలపై వెడల్పాటి అంచు ఉన్న నలుపు రంగు హ్యాట్, దాని పక్కన ఒక ఎరుపు రంగు గులాబీ ఉంది. మొత్తంగా అయితే ఫస్ట్ లుక్‌తోనే ఆమె ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందనే ఫీల్‌ని ఇచ్చింది. ఈ సినిమా నేపథ్యానికి ఈ లుక్ పర్ఫెక్ట్ అనేలా ఉంది. సినిమా విడుదల తర్వాత ఆమె పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్, ఆమె నటన కనుక హైలెట్ అయితే మాత్రం, ఈ భామకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం పక్కా అనేలా ఆమెను ఇందులో ప్రజంట్ చేశారు. అలాగే పోస్టర్ మీద ఉన్న ‘ఆమె ప్రేమే ఒక యుద్ధం’ అనే క్యాప్షన్ మరింతగా సినిమాపై క్రేజ్‌ని పెంచుతోంది.
Also Read- Virosh: గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్.. ఆ టాప్ ప్లేయర్స్ రికార్డు బద్దలైంది!
ఇక బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఒక యోధుడి తిరుగుబాటు కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కొత్త అవతార్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మనోజ్‌కు ఒక మంచి కమ్ బ్యాక్ అవుతుందనేలా అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. వారి ఆశకు తగినట్టే అంచనాలు కూడా సినిమాపై ఉన్నాయి. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఆర్. పార్తీబన్, కాంచన వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Her love isn’t soft… it’s ruthless.
Welcome to the Brutal Era.@HeroManoj1 @RiaboshapkaM @itshanumareddy @bharathmotukuri @venktareddy9916 @VSMotionPicture @truradix @dopvenu @RaviBasrur #UjwalKulakarni @SupremeSundar @ProSreenuSuresh #DavidReddy #BrutalEra#Ruthless pic.twitter.com/BCyNWTanrO— Hanuma reddy (@itshanumareddy) March 6, 2026
Also Read- Priyamani: కరీనా కపూర్‌లా చూపిస్తానన్నారు..అందుకే బికినీ వేసుకున్నా.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..