
Mrunal thakur (image credit: Instagram)
మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సీరియల్స్ ద్వారా తన కెరియర్ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత మరాఠీ సినిమాతో నటన రంగ ప్రవేశం చేసింది.

Mrunal thakur (image credit: Instagram)
ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది.తెలుగు ప్రేక్షకులకు సీతామహాలక్ష్మి పాత్రతో ఆకట్టుకుంది.

Mrunal thakur (image credit: Instagram)
ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో నాని సరసన నటించి హోమ్లీ క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మళ్లీ విజయ్ దేవరకొండ తో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు

Mrunal thakur (image credit: Instagram)
ప్రస్తుతం అడివి శేష్ హీరోగా వస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Mrunal thakur (image credit: Instagram)
ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె తాజాగా దేశీ లుక్కులో చీర కట్టి అందాలతో అభిమానులను ఆకట్టుకుంది.

Mrunal thakur (image credit: Instagram)
తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.