E-Paper
Advertisement

Virosh: గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్.. ఆ టాప్ ప్లేయర్స్‌ రికార్డు బద్దలైంది!

Virosh: గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్.. ఆ టాప్ ప్లేయర్స్‌ రికార్డు బద్దలైంది!
Advertisement

Virosh: గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) నామస్మరణే నడుస్తోంది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌, ఉదయ్‌పూర్‌‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకుని, ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వారు చేసిన ప్రతి కార్యక్రమం ఎంతగానో వైరలైంది. ఫ్యాన్స్, మీడియా ఇలా అందరినీ కలుస్తూ, వారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలో స్వీట్స్ పంచారు. దేవాలయాల్లో అన్నదానం నిర్వహించారు. ఇంకా సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలందరినీ రిసెప్షన్‌కు ఆహ్వానించి.. వారి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక రిసెప్షన్ ఈవెంటే లాస్ట్ అని కూడా వారు ప్రకటించినా, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి, వారిని ఆశీర్వదించడం.. మరో గొప్ప కార్యక్రమంగా నిలిచింది. ఇలా వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ ముగిశాయి అనుకునే లోపు.. మరో రికార్డు వారి ఖాతాలో యాడయింది. అదేంటంటే..

Also Read- Oscars 2026: ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా గ్లోబల్ బ్యూటీ.. ‘వారణాసి’కి మరింత క్రేజ్!

విరోష్ గ్లోబల్ రికార్డ్

Advertisement

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించినట్లుగా టీమ్ అధికారికంగా ప్రకటించింది. స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్‌కు మించిన లైక్స్ విరోష్ (Virosh) చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్‌కు రావడం విశేషం. విజయ్, రష్మిక మాన్యవార్ యాడ్ (Manyavar Couple Ad) పోస్ట్ ఇప్పటి వరకు 8.1 మిలియన్ లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సాధించింది. ఈ పోస్ట్‌కు 104 మిలియన్ల వ్యూస్ రావడం మరో రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో విరోష్ జంటకు ఉన్న క్రేజ్‌ను ఈ అరుదైన రికార్డ్ తెలియజేస్తోంది. ఈ విషయం తెలిసి ఈ జంట అభిమానులు వారి పేర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Also Read- Priyamani: కరీనా కపూర్‌లా చూపిస్తానన్నారు..అందుకే బికినీ వేసుకున్నా.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..

ఇక షూటింగ్స్‌తో బిజీ బిజీ

Advertisement

ప్రస్తుతం పెళ్లి కార్యక్రమాలు ముగిశాయి కాబట్టి, ఎవరి పనిలో వారు మళ్లీ బిజీ కానున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం తను అంగీకరించిన సినిమాలన్నీ పూర్తయిన తర్వాత.. రష్మిక ఓ సంచలన నిర్ణయం తీసుకోనుందనేలా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఆమె సినిమాలకు దూరం అవుతుందనేలా, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. కానీ, విరోష్ జంట నుంచి మాత్రం ఇప్పటి వరకు అలాంటి ప్రకటనేం రాలేదు.

">

Also Read- Vijay Thalapathy -Trisha: విజయ్ త్రిష రిలేషన్ రూమర్స్.. సంచలనంగా మారిన విజయ్ బాడీ గార్డ్ పోస్ట్!

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×