E-Paper
Advertisement

సర్దార్ 2 కు 500 కోట్ల కలెక్షన్స్.. జోస్యం చెప్పిన మనోజ్.. అంతా కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో?

సర్దార్ 2 కు 500 కోట్ల కలెక్షన్స్.. జోస్యం చెప్పిన మనోజ్.. అంతా కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో?
Advertisement

Sardar 2 Collections: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు కార్తీ (Karthi)ఒకరు. ఈయన పేరుకే కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. కార్తీ నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది .ఈ నేపథ్యంలోనే కార్తి పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్దార్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం సీక్వెల్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

స్పై థ్రిల్లర్ గా సర్దార్ 2..

కార్తీ, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలలో నటించిన సర్దార్ 2(Sardar 2) సెప్టెంబర్ 10వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే కార్తీ తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎస్ జె సూర్య, కార్తీ ఇద్దరు కలిసి నటుడు మంచు మనోజ్ (Manchu Manoj)తో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక మంచు మనోజ్ సర్దార్ 2 సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.

తెలుగులో 500 కోట్లు…

Advertisement

సర్దార్ సినిమా తెలుగులో చాలా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది.. తాను కూడ సర్దార్ 2 ట్రైలర్ చూశానని ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని మనోజ్ తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా 500 కోట్ల కలెక్షన్లను రాబడుతుందని కేవలం తెలుగులో మాత్రమే ఈ వసూళ్లు వస్తాయనీ దాదాపు దురంధర్ సినిమా కలెక్షన్లకు దగ్గరగా సర్దార్ 2 కలెక్షన్లు వస్తాయని తెలిపారు.. ఈ విధంగా మంచు మనోజ్ ఈ సినిమాకు దురంధర్ రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇలా మనోజ్ ఈ సినిమా కలెక్షన్ల విషయంలో జోస్యం చెప్పడంతో ఈ సినిమాకు 500 కోట్లు వస్తే చాలా సంతోషం అంటూ కార్తీ కూడా ఆనందపడ్డారు. ఇక మనోజ్ చెప్పిన విధంగానే ఈ సినిమాకు 500 కోట్లు కలెక్షన్లు వస్తాయా? అంత నమ్మకం ఏంటి బ్రో అంటూ ఈ వ్యాఖ్యలపై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సర్దార్ 2 సినిమా స్పై థ్రిలలర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ అవతార్ లో మాళవిక మోహనన్ సర్ప్రైజ్ చేస్తుండగా, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 10 తెలుగు, తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ సినిమా మనోజ్ చెప్పిన విధంగానే ధరందర్ కు దీటుగా కలెక్షన్లను రాబడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read:‘బిగ్ బాస్’ హౌస్‌లోకి జంటగా బాలు, మీనా.. మరి ‘గుండె నిండా గుడి గంటలు’ పరిస్థితి ఏమిటీ?

Related News

ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?

రణబాలి టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్…ఈ సారి రక్తపాతమే!

ఘనంగా చంద్రబోస్ కొడుకు పెళ్లి.. హాజరైన సెలబ్రిటీస్ వీరే!

సిగరెట్ తాగుతూ ప్రేయసితో అడ్డంగా బుక్కైన జయం రవి.. వీడియో వైరల్!

స్టార్ హీరోలతో పోటీపడుతున్న నాగ్.. నిర్మాతలకు షాక్..

క్రిస్మస్ బరిలో దాదా VS కింగ్ 100.. నందమూరి – అక్కినేని హీరో పోరు..

Big Stories

Advertisement
×