E-Paper
Advertisement

రోజుకి రూ.6 ఖర్చుతో ఏడాదికి పైగా అన్‌లిమిటెడ్ కాల్స్, 824GB డేటా.. BSNL దిమ్మతిరిగే ఆఫర్!

రోజుకి రూ.6 ఖర్చుతో ఏడాదికి పైగా అన్‌లిమిటెడ్ కాల్స్, 824GB డేటా.. BSNL దిమ్మతిరిగే ఆఫర్!
Advertisement

BSNL Prepaid Offers: ఫోన్ రీఛార్జ్ టెన్షన్ నుంచి ఏడాది పాటు ఫ్రీగా ఉండాలనుకునే వారికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. తరచూ రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా ఉండేందుకు అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది. సాధారణంగా ఏటా మనం చేసే రీఛార్జ్‌లకు 365 రోజులే వ్యాలిడిటీ వస్తుంది. కానీ ఇప్పుడు BSNL‌ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా అదనంగా మరో 47 రోజులను ఉచితంగా ఇస్తోంది. దీంతో ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏకంగా 412 రోజులకు పెరిగింది. అసలు ఈ ప్లాన్‌లో ఏయే లాభాలున్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజూ 2 GB హైస్పీడ్ డేటా..

ఈ రీఛార్జ్‌లో మనకు రోజూ వాడటానికి సరిపడా 2GB డేటా లభిస్తుంది. సాధారణంగా 365 రోజులకు 730GB డేటా వచ్చే ఈ ప్లాన్‌లో.. ఇప్పుడు అదనపు రోజులతో కలిపి మొత్తంగా 824GB డేటా మన సొంతమవుతుంది. అంటే ఎక్స్‌ట్రా రోజులు ఉండటం వల్ల అదనంగా మరో 94GB డేటా ఎక్కువ వస్తుంది. ఇన్‌స్టా రీల్స్ చూసేవారికి, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకునే వారికి ఈ డేటా సరిపోతుంది.

ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్..

Advertisement

ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే.. BSNL ఇస్తున్న కాలింగ్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఈ ప్లాన్ ద్వారా మనం దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా సరే అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకోవచ్చు. ఎలాంటి కాల్స్ లిమిట్స్ లేదా హిడెన్ చార్జెస్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రోజంతా మాట్లాడుకునే వెసులుబాటు ఉంది.

Also Read: ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!

రోజుకు 100 SMSలు..

Advertisement

డేటా, కాల్స్‌తో పాటు రోజువారీ అవసరాల కోసం ప్రతిరోజూ 100 SMSలను కూడా ఈ ప్లాన్ అందిస్తోంది. ఈ లెక్కన మొత్తం 412 రోజులకు గాను 41,200 SMSలు మనకు అందుతాయి. ఇక ధర విషయానికి వస్తే రూ.2399 మొత్తాన్ని 412 రోజులకు లెక్కిస్తే.. రోజువారీ ఖర్చు కేవలం రూ.5.88 మాత్రమే పడుతుంది. నెలనెలా రీఛార్జ్ చేసుకునే పనిలేకుండా ఒకేసారి పెద్ద మొత్తంతో ఏడాది పాటు ప్రశాంతంగా ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

సెప్టెంబర్ 12 వరకు మాత్రమే..

అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ అదనపు 47 రోజుల వాలిడిటీ అనేది కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే ఉండే ఆఫర్. BSNL‌ సమాచారం ప్రకారం ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్ మళ్లీ సాధారణ పాత వాలిడిటీ అయిన 365 రోజులకు మారిపోతుంది.

రీఛార్జ్ చేసుకునే మార్గాలు..

ఈ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే చాలా సులభమైన పద్ధతులు ఉన్నాయి. నేరుగా BSNL అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గరున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌కు వెళ్లొచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సప్‌లో 18004444 నంబర్‌కు మెసేజ్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Also Read: నెలకు రూ.399 మాత్రమే.. 3300GB డేటాతో పాటు 500+ టీవీ ఛానెల్స్ ఫ్రీ!

Tags

Related News

ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!

ఇంట్లోని గాలిని శుభ్రంగా ఉంచుకోవాలా? బడ్జెట్ ఎయిర్ ప్యూరిఫయర్ వచ్చేసింది

నెలకు రూ.399 మాత్రమే.. 3300GB డేటాతో పాటు 500+ టీవీ ఛానెల్స్ ఫ్రీ!

రూ.50 వేలలోపు కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కడం ఖాయం

పార్టీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్..చూడటానికి క్లాస్, సౌండ్‌లో మాస్

ట్రెండింగ్‌లో బెస్ట్ స్లిమ్ పవర్ బ్యాంక్.. అసలు ధర తెలిస్తే షాక్ అవుతారు!

జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

Big Stories

Advertisement
×