E-Paper
Advertisement

అర్ధరాత్రి నిద్రలోనే దాడి చేసే ఆత్మలు… నిద్రపోవడానికి కూడా భయపడే హర్రర్ థ్రిల్లర్

అర్ధరాత్రి నిద్రలోనే దాడి చేసే ఆత్మలు… నిద్రపోవడానికి కూడా భయపడే హర్రర్ థ్రిల్లర్
Advertisement

American Horror Mystery: నిద్రలో కనిపించే పీడకలలు నిజంగా మన జీవితంలోకి వచ్చేస్తే ? మనం మేల్కొన్న తర్వాత కూడా ఆ భయంకరమైన రూపాలు మన వెంటపడితే ? పైగా నిద్రపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుంది ? చిన్నప్పటి నుంచి నైట్ టెర్రర్స్‌ తో బాధపడుతున్న ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది. ఆమె కలల్లో కనిపించే రాక్షస శక్తి నిజంగానే ఈ లోకంలోకి వచ్చిందని తెలిస్తే ? ఆ భయానక మిస్టరీ చుట్టూ తిరిగే సూపర్‌ నేచురల్ హారర్ మూవీ ‘పారాసోమ్నియా’ (Parasomnia). మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రైలీ (Jasmine Mathews) చిన్నప్పటి నుంచే తీవ్రమైన నైట్ టెర్రర్స్‌ తో బాధ పడుతుంటుంది. సాధారణంగా నిద్రలో వచ్చే భయంకరమైన కలలు మేల్కొన్న తర్వాత మర్చిపోతాం. కానీ రైలీ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆమెకు నిద్రలో కనిపించే భయానక దృశ్యాలు, గతంలో జరిగిన ఓ విషాదకర సంఘటన తాలూకు మానసిక గాయం కలిసి ఆమె జీవితాన్ని వెంటాడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైలీకి అత్యంత సన్నిహితుడైన బెస్ట్ ఫ్రెండ్ ఒక్కసారిగా అదృశ్యమవుతాడు. అతను ఎక్కడికి వెళ్లాడో, అసలు ఏమైందో ఎవరికీ అర్థం కాదు.

Advertisement

తన స్నేహితుడి అదృశ్యానికి కారణం తెలుసుకోవాలని రైలీ స్వయంగా ఆధారాలు వెతకడం మొదలుపెడుతుంది. అయితే ఈ అన్వేషణలో ఆమెకు ఎదురయ్యే నిజం మరింత భయంకరంగా ఉంటుంది. ఇంతకాలం తన కలల్లో కనిపించి తనను వేధిస్తున్న ఓ క్రూరమైన డెమోనిక్ ఫిగర్ కేవలం తన ఊహ మాత్రమే కాదని రైలీకి అర్థమవుతుంది. ఆ రాక్షస శక్తి కలల ప్రపంచం నుంచి నిజ జీవితంలోకి ప్రవేశించినట్లు ఆమె గుర్తిస్తుంది. ఇక అక్కడి నుంచి రైలీకి అసలైన పోరాటం మొదలవుతుంది.

ఒకవైపు తన స్నేహితుడి అదృశ్యం వెనుక ఉన్న రహస్యం… మరోవైపు తన నిద్రను వెంటాడుతున్న భయంకరమైన శక్తి. తాను నిద్రపోయిన ప్రతిసారీ ఆ జీవి మరింత దగ్గరవుతున్నట్లు అనిపిస్తుంది. అసలు రైలీ స్నేహితుడికి ఏమైంది ? ఆ డెమోనిక్ శక్తే అతని అదృశ్యానికి కారణమా ? రైలీ చిన్నప్పటి విషాదానికి, ఈ రాక్షస శక్తికి ఏమైనా సంబంధం ఉందా ? చివరికి తన భయాన్ని ఎదుర్కొని రైలీ ఈ మిస్టరీని ఛేదించిందా ? అనేదే సినిమా అసలు కథ.

హారర్ లవర్స్‌కి మంచి ట్రీట్

Advertisement

జేమ్స్ రాస్ II దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాస్మిన్ మాథ్యూస్, ఆర్.జె. బ్రౌన్, సాలీ స్టెవార్ట్ తదితరులు నటించారు. ఇది జేమ్స్ రాస్ IIకి డెబ్యూ ఫీచర్ ఫిల్మ్. నైట్ టెర్రర్స్, స్లీప్ పారాలసిస్, డెమోనిక్ హారర్ అంశాలను మిస్టరీతో కలిపి ఈ కథను తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి Shudderతో పాటు AMC+, Philo ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం తెలుగు ఆడియో లేదు. కేవలం ఇంగ్లీష్‌లోనే చూడాలి. నిద్ర, పీడకలలు, దయ్యాలు కలిసిన సైకలాజికల్ సూపర్‌నేచురల్ హారర్ అంశాలంటే ఇంట్రస్ట్ ఉంటే ఈ సినిమాను ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు.

Read Also: 26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

Tags

Related News

అంతరిక్షం నుంచి వచ్చిన వింత సంకేతం… మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేసే సైన్స్ ఫిక్షన్ వండర్

శవంతో బయటపడ్డ నివ్వెరపోయే నిజాలు… షాకింగ్ ట్విస్టులున్న సీట్-ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

నగరంలో బాంబ్ డిఫ్యూజన్ హడావుడి… అదిరిపోయే హై-వోల్టేజ్ హీస్ట్ థ్రిల్లర్

ప్రాణ స్నేహితుల మధ్య అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఆవేశం… మనుషుల నైజానికి అద్దం పట్టే మైండ్ బెండింగ్ డ్రామా

చీకటి కోనలో చిత్రమైన రాక్షసి… క్షణం క్షణం వణికించే హర్రర్ మిస్టరీ

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

Big Stories

Advertisement
×