Naa Anvesh: నా అన్వేష్ తెలియని వారు ఎవరు ఉండరు. ప్రపంచ యాత్రికుడిగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వివిధ దేశాలలో పర్యటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇకపోతే ఇటీవల కాలంలో అన్వేష్ పెద్ద ఎత్తున వివాదాల గురించి స్పందిస్తూ ఈయన తన అభిప్రాయాలను తెలుపుతూ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మహిళల వస్త్రధారణ గురించి గరికపాటిని విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి అన్వేష్(Anvesh) గరికపాటి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.
ఇటీవల గరికపాటి నరసింహారావు(Garikapati Narasimharao) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పిల్లలకు పెడుతున్న పౌష్టిక ఆహారం అలాగే కోడిగుడ్ల గురించి విమర్శలు కురిపించారు. పాఠశాలల్లో పిల్లలను విద్యార్థులను చూసినట్టు కాకుండా ఏదో శోభనం పెళ్లి కొడుకును చూసినట్టు చూస్తున్నారు. గుడ్డు పెట్టడం ఏంటి గాడిది గుడ్డు.. వాళ్లకు మధ్యాహ్నం పాఠశాలలో భోజనం పెట్టడం అవసరమా అవసరమైతే క్యారేజీలు తెచ్చుకుంటారు. చదువు మాత్రమే చెప్పండి ఈయన మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఎంతోమంది స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే నా అన్వేష్ సైతం ఈ విషయం గురించి మాట్లాడుతూ గరికపాటి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. పిల్లలకు పౌష్టిక ఆహారం లేకపోతే వారికి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన గుడ్లు తిని తాను కిల్లి మంజారో పర్వతాన్ని ఎక్కానని అన్వేష్ తెలిపారు. ఇక గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళేది పేద పిల్లలు మాత్రమేనని అలాంటి వారికి వారాని ఒక గుడ్డు పెడితే మీకు వచ్చిన బాధ ఏంటి అంటూ ప్రశ్నించారు.
?igsh=OWNpYzA0Z2Mwajhn
మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లోని అక్షరాస్యత గురించి మాట్లాడండి ప్రస్తుతం నిరక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ బీహార్ ను మించి ఒకటో స్థానంలో ఉంది. వీలైతే వీటిని మార్చడానికి ప్రయత్నం చేయండి కానీ ఆంధ్రప్రదేశ్ పేరు మారుస్తాం కాకినాడ పేరు మారుద్దాం అంటూ మాట్లాడుతున్నారు. రోజురోజుకీ మీకు ఉన్న మతి కాస్త పోతుంది. మొన్ననే నేను మీకు మీ జాతకం గురించి చెప్పాను మీ జాతకం బాలేదు కాస్త జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాను మీరు మాత్రం నోరు అదుపులో పెట్టుకోకుండా పేదవాడి గురించి ఇలా మాట్లాడటం చాలా తప్పు మీరు క్షమాపణలు చెబితే సరిపోతుంది. లేదంటే మీరు మీ జీవితంలో పోయేకాలంలో ప్రశాంతత లేకుండాపోతారు అంటూ గరికపాటి పై నా అన్వేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై గరికపాటి నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Niharika Konidela: వాళ్లంతా కుక్కలు.. మొరుగుతారంతే.. నిహారిక షాకింగ్ కామెంట్స్