E-Paper
Advertisement

Sports comedy drama OTT: ఓటీటీలోకి ఆమిర్ ఖాన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Sports comedy drama OTT: ఓటీటీలోకి ఆమిర్ ఖాన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా… ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Sports comedy drama OTT: ఆమీర్ ఖాన్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ హీరో నటించి, నిర్మించిన ‘సీతారే జమీన్ పర్’ థియేటర్లలో భారీ హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా 2025 జూన్ 20న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేసి థియేటర్లలో విడుదల చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో అద్భుతమైన విజయం సాధించింది. ఆతరువాత యూట్యూబ్ ఛానెల్‌లో అద్దె ప్రాతిపదికన, తెలుగు వెర్షన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చారు మేకర్స్. అయితే ఇప్పుడు మొదటి సారిగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) 2025లో విడుదలైన స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా. 2018లో విడుదలైన స్పానిష్ సినిమా ఛాంపియన్స్ ఆధారంగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్ ఖాన్, అపర్ణా పురోహిత్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించాడు. ఆమిర్ ఖాన్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2025 జూన్ 20న విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹261 కోట్లు వసూలు చేసి 2025లో మూడవ అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను అమీర్ ఖాన్ టాకీస్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఆగష్టు 1 నుండి హిందితో పాటు, తెలుగు భాష‌లో రూ. 100 చెల్లించి చూసేలా అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ సినిమా 2026 మార్చి 10 నుంచి Sony LIV ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు.

కథ ఏమిటంటే

Advertisement

ఈ సినిమాలో గుల్షన్ (అమిర్ ఖాన్) ఒక బాస్కెట్‌బాల్ కోచ్. మనిషికి గర్వం కాస్త ఎక్కువే, పైగా కోపం వస్తే ఆగడు కూడా. ఒకసారి తాగేసి బండి నడిపి గొడవ చేయడంతో, కోర్టు ఆయనకి ఒక వెరైటీ పనిష్మెంట్ ఇస్తుంది. అదేంటంటే, బుద్ధిమాంద్యం ఉన్న కొంతమంది కుర్రాళ్లకు కోచింగ్ ఇచ్చి వాళ్లని టీమ్‌గా తయారు చేయాలి. మొదట్లో వీళ్లతో నా వల్ల కాదు బాబోయ్ అని విసుక్కున్న కోచ్, వాళ్ల అమాయకత్వాన్ని చూసి మెల్లగా మారిపోతాడు. అసలు ఆట ఇక్కడే మొదలవుతుంది.

ఆ పిల్లలకి బాస్కెట్‌బాల్ రూల్స్ నేర్పించడం కంటే, వాళ్ల దగ్గర నుండి మనోడు జీవితం అంటే ఏంటో నేర్చుకుంటాడు. లోకం దృష్టిలో వాళ్లు వెనకబడిన వాళ్లే కావొచ్చు, కానీ వాళ్లలో ఉన్న టాలెంట్ చూసి కోచ్ షాక్ అవుతాడు. వాళ్లందరినీ ఏకం చేసి, అవమానించిన వాళ్ల ముందే వాళ్లు సూపర్ స్టార్స్ అని ఎలా నిరూపించాడనేదే ఈ సినిమా కథ.

Advertisement

Read Also : భర్త లేని టైమ్ లో భార్యను దారుణంగా… రివేంజ్ అంతకు మించి… క్రాక్ ఎక్కించే స్టోరీ

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×